మనం ఇంతకు ముందు 27 నక్షత్రముల పేర్లు, వాని అధిపతుల గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు ప్రతి నక్షతమునకు సంబందించిన మొక్క గురించి తెలుసుకుందాం!
ఎవరి జన్మ నక్షత్రముననుసరించి వారు ఆయా మొక్కలను నాటి, పెంచి, ప్రత్యేకమయిన అంటే పండుగలు, నెలలో ఆ నక్షత్రం ఉన్న సమయంలో వాని చుట్టూ కనీసం 3 సార్లు తిరుగుతూ చదువవలసిన శ్లోకం గురించి మరియూ అలా చేయటం వలన కలిగే శుభ ఫలితముల గురించి చెప్పుకుందాం.
రోహిణి నక్షత్రం :

వృక్షం : నేరేడు
శ్లోకం : రోహిణి పంచతారాశ్చ జంబూ వృక్షశ్చ త్రికోణకృత:
పీత వర్ణ మయూరేచ కమలపుష్య ముత్శిరతం
ఈ శ్లోకమే కాకుండా శ్రీ విష్ణు సహస్త్రనామ స్త్రోత్రంలోని 12 నుండి 15 వరకు ఉన్న శ్లోకములు రోహిణి నక్షత్రమునకు చెందినవి. ఆ నాలుగు శ్లోకములు, ఈ నక్షత్రమునకు చెందిన నాలుగు పాదములకు సంబందించినవి. కనుక ఆయా పాదములకు చెందిన వారు ఆ శ్లోకమును కూడా చదువుకొన వచ్చును. ఒకవేళ నక్షత్ర పాదం తెలియక పోతే మొత్తం నాలుగు శ్లోకములను చదువుకొన వచ్చును.
ఫలితం : ఈ నక్షత్రం వారికి వ్యవసాయం, తత్ సంబందములు కలిసి వస్తాయి. పై విధంగా చేయుటవలన వీరికి దీర్ఘకాల వ్యాదుల నుండి ఉపశమనం లభిస్తుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి