9, సెప్టెంబర్ 2014, మంగళవారం

పల్వలుడు

పల్వలము = చిన్ని నీటి గుంత
పల్వలుడు ఇల్వలుని కుమారుడు. ఇల్వలుడు వాతాపి మహర్షి ఐన అగస్త్యుని కారణం గా మరణించారు. తన తండ్రి పిన తండ్రుల మరణమునకు ఈ మునులే కారణం అని భావించిన పల్వలుడు  నైమిశారణ్యం లోని మునులను ఋషులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. అమావాస్య నాడు మునులు పితృ తర్పణలు ఇస్తూ ఉండే కాలం లో ఈ పల్వలుడు ఆ యజ్ఞ వాటికలో సుర, మల, మూత్ర, రక్త మరియు మాంసములతో అపవిత్రం చేస్తూ ఉండేవాడు. ముని స్త్రీ లనుకూడా వేధించే వాడు.
ఒకనాడు బలరాముడు తీర్ధయాత్రలకు బయలు దేరి వెళ్ళాడు. వెళుతూ ఉండాగా, దారిలో ఒకరు కొంత కల్లును ఇచ్చారు. బలరాముడు దానిని స్వీకరించాడు. కొంతదూరం వెళ్ళాక సూతమహాముని చేస్తున్న సత్సంగమునకు వెళ్లారు. సూతుడయిన రోమహర్షనుడు  తప్ప ఆ సభలో ఉన్న అందరు మునులు, ఋషులు అవతార పురుషుడైన బలరామునకు అతిధి సత్కారములు చేసారు. కాని బ్రహ్మ స్థానం లో ఉన్న రోమహర్షణుడు తనను గౌరవించలేదని భావించి, ఇంతకూ ముందు తీసుకున్న కల్లు  ప్రభావం చేత ఆలోచించకుండా అతని తలపై ఒక్క దెబ్బ తన ఆయుధమైన రోకలితో కొట్టాడు. రోమహర్షణుడు అక్కడికి అక్కడే మరణించాడు. తరువాత తన తప్పు తెలుసుకుని పరిష్కారంగా రోమహర్షనుడిని శాశ్వతంగా బ్రహ్మలోకమునకు, అతని తెలివితేటలు, ఆయుషు ను ఆటను పుత్రుదయినా సూతునకు ఇచ్చాడు. ఇంకా ఏమైనా చెయాల అని ఋషులను అడుగగా వారు పల్వలుని గురించి చెప్పి వానిని వధించమని కోరారు. బలరాముడు రోమహర్షనుని సంహరించినది ఏకాదశి కనుక మరొక నాలుగు రోజులలో అమావాస్య తిధి వస్తుంది అని ఆ నాలుగు రోజులు బలరాముడు అక్కడే ఉన్నాడు.
అమావాస్య రోజు మునులు, ఋషులు యధాప్రకారం తన యజ్ఞమును ప్రారంభించారు. అప్పుడు ఆకాశంలో ఒక నల్లటి ఆకారం కొండలా కనిపించినది. దాని వికటాట్టహాసం భయంకరంగా ఉన్నది. మిడిగుడ్లు, విరబోసిన రాగి రంగు జుట్టు, దుమ్ము కొట్టుకుపోయిన శరీరం తో పల్వలుడు అక్కడకు వచ్చాడు. పల్వలుడిని చూసిన బలరాముడు తన నాగలితో అతని మెడను పట్టి క్రిందికి లాగి ఎడమ చేతిలో ఉన్న రోకలితో అతని తలపై ఒక్క దెబ్బ వేసాడు. అప్పుడు ప్లవలుడు అక్కడికి అక్కడే మరణించాడు.
మహర్షులు ఎంతో సంతోషించి బలరాముని దీవించి తీర్ధయాత్రలకు వెళ్లి, మిగిలిన బ్రహ్మ హత్య పాపమును తొలగించుకోమని అనుజ్ఞ ఇచ్చారు. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి