8, సెప్టెంబర్ 2014, సోమవారం

అక్షౌహిణి

మహాభారత యుద్ధం లో 18 అక్షౌహిణుల సైన్యం పాల్గొన్నది అని మనకు తెలుసు. కాని అక్షౌహిణి అంటే ఎంత?
ఎంతమంది సైనికులు? ఎన్ని ఏనుగులు? ఎన్ని గుర్రములు? ఎన్ని రధములు?
క్రింద చూడండి.



సంబంధం  
 రధములు 
 ఏనుగులు 
 సైనికులు
(పాద చార సైన్యం)
 గుర్రములు 
 పట్టి 

 1
 సేనాముఖ 
3 X పట్టి 
 3
 3
 15
 9
 గుల్మము 
3 X  సేనాముఖ 
 9
 9
 45
27 
 గణము  
 3 X గుల్మము 
27 
27 
135 
81  
 వాహిని 
 3 X గణము  
 81
81 
405 
243
 ప్రీతన 
 3 X వాహిని 
 243
243 
1215 
729 
 చాము 
 3 X ప్రీతన 
729 
729 
3645 
2187 
 అణికిని 
 3 X చాము 
 2187
2187 
10935 
6561 
 అక్షౌహిని 
 10 X అణికిని 
 21870
  21870
109350
 65610


అంతే కాకుండా ఒక్కో రధమునకు ఇద్దరు ఉంటారు. ఒక్కో ఏనుగుకు ముగ్గురు ఉంటారు. గుర్రం మీద ఒకరు ఉంటారు మరియు ఒక్కో అక్షౌహిణికి సేవకులుగా సుమారుగా ఒక వేయిమంది ఉండేవారు.  కాబట్టి మొత్తం సుమారుగా ఒక్కో అక్షౌహినికి 3 లక్షల మంది సైనికులు ఉండేవారు. మొత్తం 18 అక్షౌహిణి సైన్యం అంటే సుమారుగా 54 లక్షల మంది సైన్యం.
మరియు యుద్ధం చేసే వారి కి వారి వారి సామర్ధ్యమును బట్టి పేర్లు ఉండేవి.

అతిరధి: రధములో ఉండి ఒకేసారి 10,000 మందితో యుద్ధం చేయగలిగిన సామర్ధ్యం కలవాడు. ఉత్తర కుమారుడు, శకుని దుశ్శాసనుడు మొదలైన వారు అతిరధులు.
మహారధి : రధములో ఉండి ఒకేసారి 60,000 మందితో యుద్ధం చేయగలిగిన సామర్ధ్యం కలవారు మహారధులు.
ధర్మరాజు, భీముడు, నకుల సహదేవులు, దుర్యోధనుడు మొదలైన వారు
అతిమహరధి: రధములో ఉండి ఒకేసారి 12 మంది మహారధులతో యుద్ధం చేయగలిగినవారు అతిమహారధులు. భీష్మ, ద్రోణ, అర్జున, శ్రీకృష్ణ, బలరామ, జరాసంధుడు, కర్ణుడు అశ్వద్ధామ మొదలైనవారు
మహామహా రధులు: రధములో ఉండి ఒకే సారి 24మంది అతిమహరధు లతో యుద్ధం చేయగలిగిన వారు.
శివుడు, విష్ణువు, అంబిక మొదలిన వారు.



ఇంతే కాకుండా రామాయణంలో ఈ సంఖ్య మరింత ఎక్కువ స్థాయి వరకు చెప్పారు.
 అక్షౌహిని X 18 = ఏకము 
ఏకము X 8 = కోటి 
కోటి X 8 = శంఖం 
శంఖం X 8 = కుముదము 
కుముదము X 8 = పద్మము 
పద్మము X 8 = నాడి 
నాడి  X 8 = సముద్రం 
సముద్రం X 8 = వెల్లువ 

ఇటువంటి వెల్లువలు సుగ్రీవుని వద్ద 70 వెల్లువలు ఉండేవి. అవే రామునితో కలిసి రామ రావణ యుద్ధంలో పాల్గొన్నాయి. 

2 కామెంట్‌లు: