మనం ఇంతకు ముందు సంధ్యాదేవి - ఛాయ గురించి తెలుసుకున్నాం కదా! ఇప్పుడు సంధ్యాదేవి వెళ్ళి పోయిన తరువాత ఛాయ ఏమి చేసింది? ఇప్పుడు తెలుసుకుందాం!
సంధ్యాదేవి వెళ్ళిన తరువాత ఛాయ పూర్తిగా సంధ్యాదేవిలానే ప్రవర్తించ సాగింది. వివస్వంతునికి ఆమె సంధ్యాదేవికాదు అన్న అనుమానమే రాలేదు. వారికి ఇద్దరు పుత్రులు జన్మించారు. వారు సావర్ణి, శనైశ్చరుడు.
సావర్ణి ః వైవస్వత మనువు తరువాత వచ్చే మనువు సావర్ణి మనువు.
శనైశ్చరుడుః సర్వప్రాణుల కర్మ ఫలదాత
అప్పటి వరకూ సంధ్యాదేవివలెనే ప్రవర్తించిన ఛాయాదేవి, తనకు సంతానం కలిగిన తరువాత తన పిల్లలను ప్రేమగా చూసుకుంటూ సంధ్యాదేవి పిల్లలను వివక్షతతో చూడసాగింది.
ఆ వివక్షతను కొంతవరకూ భరించిన యముడు, కొంతకాలమునకు భరించలేక ఆమెను నిలదీశాడు. అలా నిలదీస్తున్న సమయంలో అతను కోపమునకు వశుడయ్యి తన కాలును ఆమె పైకి ఎత్తాడు. ఆ అవమానాన్ని తట్టుకోలేక ఛాయాదేవి యముని కాలు భూమిపై పడాలని శపించింది.
అలా సవతిప్రేమను చూపిన ఛాయాదేవిని వివస్వంతుడు ఏమి చేశాడు? ఆమె సంధ్యాదేవి కాదు అని తెలుసుకున్నారా లేదా? తరువాతి టపాలలో చూద్దాం!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి