మానవుడు సమాజిక జీవి. తనచుట్టూ ఎప్పుడూ తన స్నేహితులు, సన్నిహితులు ఉండాలి అని కోరుకుంటూ ఉంటాడు. అయితే అలా తన చుట్టూ ఉన్నవారు నిజంగా తన బంధువులేనా? లేక వారి వారి అవసరాల కోసం తన చుట్టూ చేరుతున్నారా అన్న విషయం ఎవరికీ వారు ఎప్పటికప్పుడు చూసుకుంటూ ఉండాలి. మరి మన బంధువులు నిజంగా ఎవరు అని మనకు ఎలా తెలుస్తుంది?
ఆ విషయాన్ని చాణక్య నీతిలో ఈ క్రింది శ్లోకం ద్వారా నేర్చుకుందాం!
ఆతురే వ్యసనే ప్రాప్తే దుర్భిక్షే శత్రుసంకటే
రాజద్వారే శ్మశానే చ యస్తిష్టతి స బాంధవః
అర్ధంః ఆతురే = రోగము; వ్యసనే= దుఃఖము; ప్రాప్తే = కలిగినప్పుడు; దుర్భిక్షే = కరువు కలిగినప్పుడు, శత్రు = శత్రువులవల్ల; సంకటే= భయం కలిగినప్పుడు; రాజద్వారే = రాజసభలో, శ్మశానే = శ్మశానంలో; యః = ఎవడు; సః = వాడే; తిష్టతి = అం డగా ఉంటాడో; బాందవః= నిజమయిన బంధువు
భావం ః మనకు అనారోగ్యం కలిగినప్పుడు, భరించలేని దుఃఖంలో మనం మునిగి ఉన్నప్పుడు, మనవద్ద జీవనానికి సరిపోను ధనము / ఉపాధి కూడా లేనప్పుడు, మనలను గొప్ప శత్రువులు ముట్టడించినప్పుడు రాజాస్థానంలో నయినా చివరకు శ్మశానంలో అయినా ఎవరయితే ఎల్లప్పుడూ మనలను విడువకుండా మన వెంట మనకు ధైర్యాన్ని ఇస్తూ నిలిచి ఉంటారో వారే మనకు నిజమయిన బంధువులు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి