గుణనిధి కోసం యమదూతలు, శివదూతలు వాదులాడుకుని చివరికి శివదూతలు గుణనిధిని కైలాసమునకు తీసుకువెళ్లారు. సూక్ష్మరూపంలో ఉన్న గుణనిధి వారి వాదనలను విన్నాడు. కైలాసమునకు వెళ్లిన గుణనిధి కొంతకాలం అక్కడ శివుని సేవలో గడిపేశాడు. కొంతకాలం తర్వాత ఆ గుణనిధి తన పూర్వజన్మలో చేసిన చివరి మంచిపనులు కారణంగా తిరిగి భూలోకంలో కళింగరాజ్యమునకు రాజయిన అరిందమునకు కుమారునిగా జన్మించాడు.
అరిందముడు తనకుమారునకు దమనుడు అని పేరుపెట్టారు. తిరిగి మానవునిగా జన్మించిన తరువాత కూడా అతనికి పూర్వజన్మ, చివరి కాలంలో జరిగిన సంఘటనలు గుర్తు ఉన్నాయి. అరిందముని తరువాత దమనుడు కళింగ రాజ్యమునకు రాజు అయ్యాడు. అతను రాజు అయిన సమయం నుండి ప్రతి మాస శివరాత్రికి ప్రతిశివాలయంలో దీపములు ఏర్పాటుచేయాలని ప్రజలను కోరాడు.
అలా గుణనిధిగా సకల వ్యసనములకు బానిస అయిన వ్యక్తి అదృష్ట వశాత్తు శివపూజ చేసిన ఫలితంగా అతనికి ఉత్తమ గతులు ప్రాప్తించటమే కాక అతని ఒక రాజు అయ్యి తన రాజ్యంలో ఉన్న అందరు ప్రజలను కూడా శివుని భక్తులను చేసాడు. వారికి కూడా ఉత్తమ గతులను కలిగించాడు.

in his next life, He born as Kubera,
రిప్లయితొలగించండిa friend of god Sri Shiva,
king of Yaksha
అవును.
రిప్లయితొలగించండిచదివినందుకు ధన్యవాదములు.