మనం ఇంతకు ముందు గుణనిధి గురించి చెప్పుకుంటున్నాం! అతనిని అతని తండ్రి వదిలేసాడు. తరువాత అతను దొంగగా మారి ఆహారం దొగతనం చేస్తూ దొరికిపోయి రక్షకభటుల చేతిలో ఒక్క దెబ్బకు ప్రాణములు వదిలేసాడు. తరువాత ఏమయ్యిందో ఇప్పుడు చూద్దాం!
అతను చనిపోయిన మరుక్షణం యమదూతలు వచ్చి, గుణనిధి సూక్ష్మదేహాన్ని పాశములతో కట్టి బందించి యమలోకమునకు తీసుకు వెళ్లబోతుండగా వారికి శివదూతలు ఎదురువచ్చి ఆ గుణనిధి సూక్ష్మదేహము కైలాసమునకు వెళ్ళవలసి ఉన్నది కావున వారికి ఇవ్వవలసినది అని కోరారు.
ఆశ్చర్య పోయిన యమభటులు గుణనిధి చేసిన అకృత్యములను, అతనికి ఉన్న సప్తవ్యసనములను, అతని తండ్రి స్వయంగా అతనికి తిలోదకములు వదలటం అన్నీచెప్పి అతనికి యమలోకంలో తప్ప ఇంకెక్కడా ఉండటానికి అర్హత లేదు అని చెప్పారు. ఆ మాటలు విన్న శివదూతలు అతను ఇంతకుముందు ఎన్ని పాపములు చేసినా ఆ రోజు శివునికి అత్యంత ప్రీతికరమయిన బహుళ చతుర్దశి అంటే మాసశివరాత్రి అవ్వటం వలన, తెలిసో తెలియకో ఆటను ఆ రోజంతా ఉపవాసం ఉండటం వలన, శివుని గర్భగుడిలో దీపములను వెలిగించుట వలన అప్పటి వరకు కలిగిన పాపములు అన్ని తొలగిపోయాయి అని చెప్పారు.
అలా అత్యంత దుష్టుడు, వ్యసన పరుడు అయినా కూడా గుణనిధి చివరి సమయంలో చేసిన శివ పూజ కారణంగా శివలోకం చేరుకున్నాడు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి