ముక్తి కుండం గురించి ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! మరి నారద కుండం ఎక్కడ ఉన్నది అనే అనుమానం ఇక్కడ తీరుస్తాను.
సర్పవరంలోని భావనారాయణ దేవాలయం దగ్గరలో ముక్తి కుండం ఉంది అని చెప్పుకున్నాం కదా! దానికి కొంచెం దూరంలో ఈశాన్యం దిక్కుగా ఈ నారద కుండం ఉంటుంది. నడువగలిగిన వారికి దాదాపు 15 నిముషముల దూరంలో ఉంటుంది ఈ నారద కుండం. శ్రీ భావనారాయణ స్వామి దేవాలయం నుండి సర్పవరం జంక్షన్ కు వెళ్ళే దారిలో ఎడమ చేతివైపున ఉన్న ఒక చిన్న సందులో లోపలకు ఉంటుంది ఈ నారద కుండం. నారద కుండం ఒడ్డున శ్రీ భవానీ సమీత శ్రీ నీలకంఠేశ్వర స్వామి సన్నిధి ఉన్నది. ఈ నారద కుండమునకు ప్రతినిత్యం సాయంత్రం 7. 00 గంటలకు నక్షత్ర మరియు కర్పూర హారతులు ఇస్తారు.
ఈ దేవాలయం లో ఉన్న మరో ప్రత్యేకత "సప్త ఋషి మండలం", "దక్షిణామూర్తి దేవాలయం మరియు ధ్యాన మందిరం". ఈ దేవాలయంలో సప్తఋషుల శిలాప్రతిమలు ఉన్నాయి. వారికి చిన్ని మందిరములు కూడా ఉన్నాయి. వారి మన్దిరములకు ముందు ఒక్కో మొక్క ఉన్నాయి.
ఆ వివరములు

- కశ్యపుడు - తులసి
- అత్రి - అవిస
- భరద్వాజ - ఉత్తరేణి
- విశ్వామిత్ర - మారేడు
- జమదగ్ని - గరిక
- గౌతముడు - ఉమ్మెత్త
- వసిష్ఠ - జమ్మి
ఈ మహర్షులకు ఆయా మొక్కలకు గల సంబంధం నాకు తెలియలేదు. వీరే కాక అక్కడ వాల్మీకి మహర్షి, వేద వ్యాసుడు, బమ్మెర పోతన మరియు ఆదిశంకరాచార్య -ప్రతిమలు ఉన్నాయి. ఈ దేవాలయ ప్రాంగణంలో దుర్గాదేవి ఆలయం కూడా ఉన్నది.
ఈ దేవాలయంలో జరిగే పూజల వివరములు
- ప్రతినెలా శుద్ధ త్రయోదశి సాయంత్రం 7 గంటలకు పార్వతి కల్యాణం (భక్తులకు ఉచితం)
- పౌర్ణమికి కుంకుమ పూజలు నిర్వహిస్తారు (పూజా ద్రవ్యములు ఉచితం)
- మాస శివరాత్రి రోజున సాయంత్రం 6. 30 కి అమ్మవారికి స్వామివారికి ప్రదోష పూజలు జరుగును
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి