అరి అంటే సంస్కృతంలో శత్రువు అని అర్ధం. షట్ అంటే ఆరు అని. అరిషట్ వర్గములు అంటే మనలో ఉండే ఆరు శత్రువులు. అవి
- కామం - ధర్మబద్ధం కాని కోరిక
- క్రోధం - తనను తను అదుపుచేసుకోలేని విపరీతమైన కోపం
- లోభం - తన అవసరాలకు కూడా ధనమును వినియోగించుకోలేని పిసినారి తనం
- మోహం - ఏది చేసినా నాది, నా అనే స్వార్ధం
- మదం - అతిశయించిన గర్వం
- మాత్సర్యం - ఎదుటి వారికి ఉన్నది నాకు లేదు అనే అసూయ
చూడటానికి చిన్నగా ఉన్నా ఇవి మానవులకు చేసే అపకారాలు లెక్కకు మించినవి. ఇవి ఒక మనిషిలో ఉన్నప్పుడు అవి ఎదుటి వారికి చేసే హానికంటే అవి ఆ వ్యక్తికి చేసే హాని ఎక్కువ ఉంటుంది.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి