సుర్యుని పుత్రుడయిన 14 మంది మనువులలో ఒకరు అయిన వైవస్వత మనువు అతని భార్య శ్రధ్ధాదేవిలకు సంతానం కలుగుట కోసం వసిష్టమహర్షి చేత యజ్ఞం చేయించారు అని మనం ఇంతకు ముందు తెలుసుకున్నాం! ఆ యజ్ఞం జరుగక ముందు కధనం ఇప్పుడు చూద్దాం!
వైవస్వత మనువు తన భార్యతో కలసి అయోధ్యా అనే నగరమునకు నిర్మించారు. వారు యజ్ఞము చేయుటద్వారా సంతానమును పొందాలని అనుకుని గురు వసిష్టుని ఆశ్రయించారు. కానీ పురాణముల ప్రాకారం ఒక యజ్ఞము చేసినందు వలన అత్యంత ఫలితము పొందాలంటే ఆ క్రతువు నీటి దగ్గర జరగాలి. అయోధ్యా నగరం దగ్గరలో ఏవిధమయిన నీటి వనరులు లేవు కనుక యజ్ఞము చేయాలని అనుకుంటే ముందుగా అయోధ్యా నగరమునకు నీటి వనరులను సమకూర్చవలసిన అవసరం ఉంది. కనుక వసిష్టుడు వైవస్వతునకు తన కర్తవ్యం భోదించాడు. అప్పుడు వైవస్వతుడు తన శరముతో మానససరోవరమునుండి ఒక నదిని బయలుదేరదీశాడు. ఆ నది అయోధ్య పక్కనుండి వెళ్ళేలా ఎర్పాటు చేసాడు.
ఆ నది పుట్టుక శరం వలన కలిగింది కనుక ఆ నదికి శరయు నది అనీ, మానస సరోవరము నుండి పుట్టినది కనుక ఆ నదికి సరయు నది అనే పేర్లు వచ్చాయి. ఆ నది ఒడ్డున వారు యజ్ఞము చేసి సంతానమును పొందారు.