మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో ఎనిమిది భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు.
సంస్కృత శ్లోకం:
యస్య కృతం న జానన్తి మన్త్రం మస్త్రితం పరే
కృతమేవాస్య జానన్తి స వై పండిత ఉచ్యతే
శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః
పరధనలోలుపుండు భయవంతుడు వృధ్య సమృధివిఘ్న సం
భరితుడు గాక యెవ్వడు స్వమంత్రితమంత్రణ కార్యసంతతిన్
బరుల కఱుంగనీక తనపాలిటికార్యము జక్కజేయునా
నరుడిలబండితుండని జనంబులు మెత్తురు కౌరవేశ్వరా
భావం:
ఇతరుల ధనమును పొందాలని లేని, భయములేని వాడు అయ్యి, తను చేయాలనుకున్న పనులకు చెందిన అలోచనలను ఇతరులకు తెలియకుండా చేస్తూ, కేవలం తన పనుల ద్వారా అతని ఆలోచనలను తెలియ పరుస్తూ ఉంటారో అటువంటి వారినే పండితులు అంటారు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి