ఈ రోజులలో సహజంగా దేవాలయములకు వెళ్ళేది ఆడవాళ్లే. ఆడవాళ్ళ బలహీనత అద్దం. ఈ రెండింటిని ఒకే చోట చేరిస్తే, అద్దములతో ఒక దేవాలయం నిర్మించి, అక్కడ నిత్య పూజలు జరుగుతూ ఉంటే, అక్కడికి మీరు కూడా వెళ్ళవచ్చు అని చెప్తే ఇక ఆడవాళ్ళ ఆనందం అపరిమితం కదా! మరీ అంత ఆనంద పడకండి. ఆ దేవాలయం మనకు అందుబాటులో లేదు, మలేషియాలో ఉన్నది. కొంత నిరుత్సాహం కలిగినా మన దేవాలయమునకు దొరికిన అత్యంత అపూర్వమైన ఖ్యాతి గురించి తెలుసుకోవటం మంచిదే కదా!
ఈ దేవాలయం మలేషియా లోని జోహోర్ రాష్ట్రంలో ఉన్నది. ఈ రాష్ట్రం సింగపూర్ కి అతి దగ్గరలో ఉంటుంది.
ఈ దేవాలయంలో దేవత పేరు ఆరుల్మిగు శ్రీ రాజకాళీ అమ్మ. 1922 లో నిర్మించబడిన ఈ దేవాలయం ఆ ప్రదేశంలో ఉన్న చాలా పాత దేవాలయం. తరువాత 1996 లో పునరుద్ధరణకు లోనయింది. ఈ దేవాలయమునకు ఇంత విశిష్టత చేకూర్చిన ఆ వ్యక్తి పేరు "సిన్నతంభి శివసామి". వీరు ఒకప్పుడు బాంగ్కాక్ (Bangkok) వెళ్లారట. అక్కడ ఒక దేవాలయం గోపురం మీది ఒక అద్దం ఎంతో దూరంలో రోడ్ పై కార్ లో వస్తున్న సిన్నతంబి శివసామి వారి కళ్ళలోకి తళ్ళుక్కు మని ప్రతిబింబించిందట. అది ఏమిటో తెలుసుకోవాలని వారు ఎంతో ప్రయాసపడి చివరకు అది ఒక దేవాలయం పైన అమర్చిఉన్న చిన్న అద్దం అని తెలుసుకున్నారట. అంతే అప్పుడే వారి కి ఒక అపూర్వమైన ఆలోచన వచ్చింది. ఒక చిన్న అద్దంముక్క ఎక్కడో ఉన్న రోడ్ మీదకి ప్రతిబింబిస్తే, ఒక దేవాలయం మొత్తం అద్దాలతో అలంకరిస్తే? అంతే వెంటనే మలేషియా తిరిగి వచ్చారు. ఇక తన ఆలోచనలకు కార్యరూపం ఇచ్చారు. ఒకటికాదు రెండుకాదు 3,00,000 ముక్కల అద్దాలు. ఎరుపు, ఆకుపచ్చ, నీలి, పసుపు, ఉదా మరియు తెలుపు రంగుల అద్దపు ముక్కలతో అధ్బుతంగా కన్నులు చెదిరేలా తయారయ్యింది. అంతే కాకుండా ఈ దేవాలయం మొత్తం శీతలీకరణం చేయబడినది. (airconditioned). ఈ దేవాలయం 2009 లో సర్వాంగ సుందరంగా భక్తులకు అందుబాటులోకి వచ్చినది.
ఈ దేవాలయ ఘనత ఏమంటే ప్రపంచంలో మొట్టమొదటి అద్దాల దేవాలయం ఇదే. అంతే కాదు 2010 లో మలేషియా బుక్ అఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించింది.
ఎలా చేరుకోవచ్చు?
ఒకవేళ మీరు మలేషియాలో ఉన్నట్లయితే ఫ్లైట్, రైలు లేదా రోడ్డు మార్గం ద్వారా చేరుకోవచ్చు. ఇంకా ఈ రాష్ట్రం సింగపూర్ కు దగ్గరగా ఉండటం వలన సింగపూర్ నుండి కూడా రోడ్డు మార్గం ద్వారా చేరుకొనవచ్చు. ఒకసారి ఆ రాష్ట్రంలో అడుగుపెట్టాక ఏదయినా క్యాబ్ లో ఈ దేవాలయమునకు చేరుకోవచ్చు. ఐతే అక్కడి క్యాబ్ డ్రైవర్స్ ని GLASS TEMPLE అని అడగాలి. ఐతే మీరు ముందు అక్కడకు చేరుకోగానే ఆ సిటీ మ్యాప్ ఒకటి చేతులో ఉంచుకోవటం మంచిది. ఒకవేళ డ్రైవర్ కి దారి తెలియక పొతే మీరు గైడ్ చేయవచ్చు. అంతే కాదు మీరు వెళ్లేముందు దేవాలయం సమయాలు చూసుకుని వెళ్ళటం మంచిది.

ఇది కేవలం ఆ దేవాలయ ముఖచిత్రం మాత్రమే. ఆ దేవాలయం లోపలికి వెళితే కన్నులు చెదిరిపోయే ఆ సౌందర్యం స్వయంగా అనుభవించాల్సిందే. మరి ఆ వివరాలతో తరువాతి పోస్ట్ చేస్తాను. అప్పటివరకు... తెలుగే మాట్లాడదాం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి