మేల్కొటేలో చూడదగిన ప్రదేశాలలో రాయ గోపురం/ సీతారామ గోపురం అని పిలువబడే ఈ ప్రదేశంలోనే శ్రీ సీతారాములు ఈ ప్రదేశమునకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలు వారికి స్వాగతం పలికిన స్థలం అని చెప్తారు. ఐతే ఈ గోపురం తన శిల్పకళా నైపుణ్యంతో చిరస్థాయిగా తనపేరు నిలుపుకున్న శ్రీ జక్కన మహాశిల్పి ఒక్క రాత్రిలో చెక్కారు అని మరో కధనం.
జక్కన గారి ప్రత్యర్ధులు జక్కన శిల్పకళా నైపుణ్యం పరిక్షించదలచి, వారిని ఒక్కరాత్రి లో ఈ గోపురమును నిర్మించమని షరతు విధించారట. ఆ షరతుకు అంగీకరించిన జక్కన ఈ గోపురమును నిర్మించటం మొదలు పెట్టారట. ఐతే మధ్యరాత్రికి దాదాపుగా సగంపూర్తయిన చూసి, తెల్లవారేసరికి జక్కన ఈ గోపురం పూర్తిగా నిర్మించాగలడు కనుక వారి ఓటమిని ముందుగా ఉహించిన ఆ ప్రత్యర్ధులు నాలుగవ ఝాము వచ్చేసినది అనేటట్లుగా ఆ అర్ధరాత్రి సమయంలో గంటలు మొగించారట. తన శిల్పకళా నైపుణ్యం మరొకరి స్వార్ధం ముందుఓడిపోయినది అని తెలుసుకున్న జక్కన గారు ఈ గోపురమును పుర్తిచేయకుండానే అక్కడి నుండి వెళ్లిపోయారట.
ఇప్పటికి ఇక్కడ నాలుగు స్తంభాలు, వాని చుట్టూ శిల్పకళా ఖండాలు ఉంటాయి తప్ప వాటి పైన గోపురం ఉండదు. ఈ రాయగోపురం శ్రీ యాదవగిరికి చేరుకునేందుకు ముఖద్వారంగా ఉంటుంది.
ఈ గోపురమును చేరుకోవాలంటే కాళ్ళకు కొంచెం పని చెప్పాల్సిందే. దారి కొండరాళ్ళతో మలచి ఉంటుంది.
పైకి వెళ్ళాక అక్కడ నుండి మెల్కోటే అందాలను చూసిన వారికి ఇది పెద్ద విషయంగా అనిపించదు. చెలువనారయణుని దేవాలయం నుండి కేవలం 10 నిముషములలో ఈ రాయగోపురమునకు నడచి చేరుకోవచ్చు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి