మనం ఎటువంటి ఉరిలో నివాసం ఉండాలో మన పెద్దలు సంస్కృతంలో ఇలా చెప్పారు
ధనిక: శ్రోత్రియో రాజా నదీ వైద్యస్తు పంచమ: l
పంచ యత్ర న విద్యన్తే న తత్ర దివనం వసేత్ ll
ఇదే శ్లోకం తెలుగులో సుమతీ శతక కర్త ఈ విధంగా చెప్పాడు.
అప్పిచ్చు వాడు వైద్యుడు
ఎప్పుడు నెడతెగక పారు నేరు ద్విజుడున్
చొప్పడిన యూరనుండుము
చొప్పడకున్నట్టి యూర జొరకుము సుమతి.
భావం: ధనవంతుడు, వేద శాస్త్రములు చదివి వానిని నిరంతరం అనుగమించె బ్రాహ్మణుడు, ధర్మ మరియు న్యాయముల ప్రకారం పరిపాలన చేయు రాజు, ఆహారం పండించుటకు పొలమును తడుపుటకు ఉపయోగపడే నీరు కలిగిన నది, ఇంకా వైద్యుడు అనే ఈ ఐదుగురూ ఉందని ఊరిలో ఒక్క రోజు కూడా ఉండకూడదు.
సంస్కృతంలో చెప్పిన పై శ్లోకం చాణుక్యుడు చెప్పినట్లుగా ఉన్నది. ఈ శ్లోకం తెలుగులోనికి తీసుకు వచ్చిన సుమతీ శతక కర్త ఒక న్యాయ పరమైన పరిపాలన సాగించే రాజు కూడా ఆ ఊరిలో ఉండాలి అని ఎందుకు చెప్పలేదో మరి!

Undani ....chinna correction paapa
రిప్లయితొలగించండి