3, ఏప్రిల్ 2018, మంగళవారం

పంచ పాండవులు - పన్నెండు వనములు


మహాభారత కధ మనకు అందరికీ తెలుసు. పంచ పాండవులు జూదంలో ఓడిపోయి పన్నెండు సంవత్సరముల అరణ్యవాసం, ఒక సంవత్సరము అజ్ఞాతవాసం చేసారు అని మనకు తెలుసు కదా! అయితే మనకు తెలియని ఒక చిన్న విషయం వుంది ఆ అరణ్యవాసం కి సంబందించి. అదేమిటంటే, వారు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారు ఒకొక్క సంవత్సరము ఒకొక్క వనంలో నివసించారు. ఆ పన్నెండు వనముల పేర్లు మీకోసం!
  1.  సూర్య వనము·        
  2. రామ ఋషి వనము
  3. మృగ/ మహర్షి వనము
  4. గాలవ మహాముని వనము
  5. సైంధవ మహా ఋషి వనము
  6. కామధేను పర్వతము
  7. గంధర్వ పర్వతము
  8. గురుపర ఋషి వనము
  9. రోమ ఋషి వనము
  10. భౌరుండ వనము
  11. సభా మృగ వనము
  12. కాల భైరవ వనము
ఒకొక్క వనములో ఒకొక్క విచిత్రము, పాండవులకు ఒకొక్క అనుభవము ఎదురయినాయి. వాని గురించి మరొకసారి చెప్పుకుందాము.

30, నవంబర్ 2017, గురువారం

మంచి, చెడు- 3

ధనము నందు అత్యాశ గలిగి ఉండుట కంటే దుర్గుణము లేదు
అబద్ధములు చెప్పుట కంటే పాపము వేరొకటి లేదు - సత్యవాక్కును మించిన తపస్సు లేదు
మనస్సు పవిత్రంగా ఉండుట కంటే గొప్ప తీర్ధము లేదు . సౌజన్యము కు మించి పరివారము లేదు
 మంచి పనులు చేయుట వలన ప్రాప్తిoచిన పరువు అన్నింటి కంటే ప్రకాశమైన అలంకారం
విద్య కంటే విలువ గల ధనము లేదు
లోకనిందను మించి నీచమైన చావు లేదు  

28, నవంబర్ 2017, మంగళవారం

మంచి,చెడు -2

మన పెద్దలు ఏ విషయాన్ని చెప్పినా మంచిని చెడును సమాంతరంగా చెప్తారు. ఒక విషయాన్ని మంచిది అని చెప్తున్నప్పుడు దానికి సంబంధించి చెడుఎలా ఉండవచ్చో కూడా చెప్తారు. ఇటువంటి మంచి చెడుని నిర్వచిస్తున్నప్పుడు వారు ముఖ్యంగా మనిషి సామాజిక బాధ్యతకి ప్రాముఖ్యత ఇచ్చారు. 

అటువంటివి కొన్ని మనం చూద్దాం.

మంచి:  
ఆకలిగొనిన వారల కన్నము పెట్టవలెను
దాహము గలిగిన వారికి దాహశాంతి చేయవలెను
దుఃఖములో ఉన్నవారికి అవసరమయిన సహాయం చేయవలెను ఒకవేళ మన వంతు సహాయం చేయలేక పొతే కనీసం వారికి ఓదార్పు కలిగేలా మసలితే మంచిది.

చెడు : 
పక్కవారి ఆకలిని, దాహమును గమనించకుండా తన భోజనము తాను చేయుట అన్నింటికంటే చెడ్డ పనిగా మన పెద్దలు చెప్పారు.
పక్కవారు దుఃఖంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకపొతే రేపు అటువంటి సమస్య మనకు కలిగినప్పుడు మనకు సహాయం చేయటానికి ఎవరు వస్తారు?

27, నవంబర్ 2017, సోమవారం

మంచి, చెడు -1

ఈ రోజులలో ఉద్యోగం చేసే టప్పుడు అధికారి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేదాని గురించి మన పెద్దలు ఏ విధంగా అది   కత్తిమీద సామువంటిదో విపులంగా ఎలాచెప్పారో చూద్దామా!
యజమాని/ అధికారి  దగ్గర ఎక్కువగా మౌనముగా ఉంటే మూగవాడు అంటారు
యజమాని/ అధికారి  దగ్గర  ఎక్కువగా మాట్లాడితే అధిక ప్రసంగి  అంటారు
యజమాని/ అధికారి కి అత్యంత సమీపంగా ఉంటే గర్వితుడు అంటారు
యజమాని/ అధికారితో అంటీ ముట్టనట్లు దూరంగా ఉంటే భయస్తుడు అంటారు
యజమాని/ అధికారి ప్రవర్తనను ప్రశ్నించకుండా భరిస్తుంటే పిరికివారు అంటారు
యజమాని/ అధికారి ముందు తన ఆత్మగౌరవమును కాపాడుకొనే ప్రయత్నం చేస్తే గౌరవము లేని వ్యక్తి అని చెప్పుకుంటారు
కనుక ఉద్యోగము  చేసే దగ్గర మనపని మనం చూసుకోవాలి, మరీ ఎక్కువగా మాట్లాడకుండా, అవసరమైన దగ్గర మాట్లాడకుండా ఉండకుండా మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. 

26, నవంబర్ 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 100

సీ  : సీస పద్యములిదొ శ్రీరామ మాలగా 
             గూర్చి మీ కొసగితి కొదువ లేక 
        శత పుష్ప మాలిది సంతసంబున గొని 
             దంపతుల్ ముదమొOద దాల్చరయ్య 
       తావి నిండిన పూల దండలివి మెడదాల్చి 
            చెడిపోవకుండగా జేయరయ్య 
       బీద దాసుడిచ్చు ప్రేమ కానుక గొని 
            మంగళంబులు సామి మాకు నొసగు 
       
తే :   గ్రుడ్డి పూలంచు నిర్గందకుసుమమనుచు
        మనసు నందున రోయక మణిసరాల
        టంచు రామానుజుండిచ్చు హారమిదిగొ
       అందుకొనవయ్య శ్రీరామ వందనములు

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

4, అక్టోబర్ 2017, బుధవారం

శ్రీరామ శతకము – 99

సీ   : చంచరీకము తేనె యంచితంబుగ గ్రోలె
                        పరువెత్తు మందార పాదపముకు
         గాక వేమును గ్రోల కడు నుత్సహించునే
                         కమలాక్ష నాయాత్మ కలత లేక
        నీ పదామృత చింత నెమ్మి మానసమందు
                         లగ్నమై యితరంబులకును జనదు
        సామి మతిభ్రమ జరుగకుండగ బ్రోచి
                        కాపాడు మేవేళ కరుణ తోడ
       
తే :   దాసు యీ కోర్కె దీర్చOగ తగును నీకు
         జనని సీతామ తల్లితో సరగ వచ్చి
         మంగళా శాసనము జేసి మమత తోడ
        అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

5, జులై 2017, బుధవారం

శ్రీరామ శతకము – 98

సీ   : తనయుడు తండ్రివిధంబు సంబంధంబు
                  జీవేశ్వరుల బంధమవని యందు
          రక్ష్యరక్షక భారరమ్యమౌబంధము
                  నారాయణునకును నరునకెపుడు
         శేషశేషిత్వముల్ చేతనేశ్వరులకు
                 చెవులుగా బంధమై నిలిచియుండు
       భర్త్రుభార్యాబంధ పావన బందము
                  పరమాత్మ నాత్మకు పరుగు నెపుడు
       
తే :   ఆత్మ యాత్మీయ బంధంబు లనగా
           నవ విధంబులఁ బాంధవ్య మనకుం
           వాడె నీవౌట నిన్నింక వదలలేను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

2, జులై 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 97

సీ  :  బలు  రోగములకెల్ల పరమౌషదంబిది
               పాతకంబుల బాపు భళిరె మందు
         దైత్యుల హతుజేయుదండి యౌషధమిది
                మునులెల్ల పఠియించి మురియుమందు
         ఐశ్వర్య మొసగెడి అందమౌ మందిది
                పాముకాటును  మాన్చు భారి మందు
         భక్తులు జీవించ భవ్య యౌషధమిది
                 దుష్టులు నశియించు దొడ్డ మందు
       
తే :    పెద్దలాచార్యులెల్లరు ప్రీతి గొనెడి
          అదియె అష్టాక్షరని యెడి యాది మందు
          దీని సేవించి సుఖియింతు రను దినంబు
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

21, ఏప్రిల్ 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 96

సీ :  దాసుని దోషముల్ తరచుగా వినవయ్య
                 విని నన్ను మదిలోన వెఱ్ఱియనకు
        వినయంబులవి నక్కవినయంబులగు దేవ
                 జపము లెల్లను బక జపము లౌను
        మర్కటచేష్టలు మానగలేదెందు
                   శీలంబు మార్జాల శీలమరయ
        శునక వాలమువోలె మనసెందు నిలువదు
                   హృదయంబు కత్తెరైబాధ పెట్టు
       
       
తే :   గోముఖంబును గలవాడ క్రూర మతిని
          ముష్టి పండును బోలు ముఖముఁజూడ
          దుర్గుణంబులు వివిగాంచి దుష్టుడనక
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

20, ఏప్రిల్ 2017, గురువారం

శ్రీరామ శతకము – 95

సీ :  పరుల సొమ్మును జూచి బాధ జెందుట కన్న
                   పరమాత్మ నినువేడ పరమ సుఖము
         పరుల భోగము జూచి భోరునేడ్చుటకన్న
                    వారనిదన్ గొల్చుట పరమ సుఖము
         అన్యు సంపద జూచి అలమటించుటకన్న
                     అఖిలాండపతి గొల్వ యమరు సుఖము
         అన్య దేవతలను యాశ్రయిOచుటకన్న
                     లక్ష్మివల్లభు సేవ లక్ష సుఖము
         
       
తే :    ఇట్టి సుఖములుచేవీడి యిహముగోరి
           చెడుట నిక్కంబు సౌఖ్యంబు జెందగోరి
           నిన్నెభజియిOతు నేవేళ నిక్కముగను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

18, ఏప్రిల్ 2017, మంగళవారం

శ్రీరామ శతకము – 94

సీ :  పంకేరుహాక్షనా సంకటంబులు బాప
                గరుడవాహన యేల కదలి రావు
         మొర నాలకించవా మును గోపికలు వేడ
                నేడేల వినవు నా నేరమేమి
          ప్రియ  మొనరించవా ప్రేమ కుచేలున
                  కప్రియుండని నాకు ఆంక్ష విడకు
           దరి జేర్చవా నన్ను తనయుని గాపాడ
                   భారమా నొకడను భక్తపోష   
       
తే :    భువనములనెల్ల నేవేళ గానలేదె
          నేడు నను గావకుండిన నిందరాదె
          కరుణ జూడుము కడసారి కాంక్ష తోడ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

16, ఏప్రిల్ 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 93

సీ :  నా మనో భ్రమరంబు నాధ నీ శ్రీపాద
                తీర్ధంబపేక్షించు దిన దినంబు
         జిహ్వ కీరంబులు చింతించు దేవర
                 తళియ ప్రసాదంబు తమిని గ్రోల
          నేత్ర చకోరముల్ నీ ముఖ చంద్రికల్
                   సేవించ నాశించు చిరము గాను
          ఆడియని చిత్తంబు హరి దివ్య తిరుమేను
                   సౌందర్య మీక్షించ చలము సేయు 
       
తే :   దాసుడను నాదు అవయవాల్ దాస్యసేవ
          చేయగోరుచున్నవి శ్రీనివాస
          మనసు స్థైర్యంబు నొనగురమానసుండ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

15, ఏప్రిల్ 2017, శనివారం

శ్రీరామ శతకము – 92

సీ :  ధర్మంబు నాల్గు పాదంబుల నడచెను
                 కృతయుగ మందెంచు వెతలు లేక
        మూడు పాదంబుల ముఖ్యమౌ ధర్మము
                  త్రేతాయుగంబున ప్రీతి నడచె
         రెండు పాదములౌచు నుండును ధర్మంబు
                   ద్వాపరంబుననట్లు వాసిగాంచె
          ఏక పాదము ధర్మమీరీతి నుండగా
                    కలియుగంబున నెందు కలహమొందు
       
తే :   జారచోరత్వమవినీతి జవము గల్గి
          ధర్మచింతయు భక్తియు ధర నశించు
          కలియుగంబందు నన్నింక కరుణనేలి
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

14, ఏప్రిల్ 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 91

సీ :    దారీషణము జూడదగు పక్షులందున
                      మక్కువగా జంట మరులు కొనుచు
           ద్రవ్యేచ్చయాది సర్పరాజుల యందుండు
                      నిధినాశ్రయిOచుచు నిలుచునెప్పుడు
           పుత్రీషణము జూడపుడమి గోవులయందు
                      కనిపించు మక్కువ ఘనముగాను
           ఈషణత్రయమందు నేదియు వదలక
                       కాంక్షించు నరుడు తా కామమొంది
         

తే :   ధరను యైహికమస్థిర ద్రవ్యములను
          తృణముగానెంచి నారాయణుని దలంచి
          నిత్యకైంకర్యమాశించ నిలచినాను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

13, ఏప్రిల్ 2017, గురువారం

శ్రీరామ శతకము – 90

సీ :  నింగిని రిక్కాలు నీ యాజ్ఞమీరక
                   పరివేష్టనము చేయు పరిధి విడక
         శశిభాను గ్రహములు సప్తర్షులెల్లరు
                   అవధిదాటక తిర్గునంబరమున
        జలధులు నీ యాజ్ఞజగముల ముంచక
                    చెలియలి కట్టను చేరవెరచు
        కలిదోషమున జేసి మలిన మానసు నౌట
                    ధర్మ శాస్త్రములెల్ల తప్పుయనుచు
       
తే :    వేదములకపార్థంబులు వేరెదెలిపి
           భాగవత ధర్మ పద్ధతుల్ పారద్రోలి
           నాశ మొందుచునుంటిని నన్నువిడక
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

12, ఏప్రిల్ 2017, బుధవారం

శ్రీరామ శతకము – 89

సీ :  మన్మధా నను నీవు మరులుగొల్చెదనంచు
                  గర్వించి వేధించకను తొలంగు
        శివుని మూడవకన్ను చిచ్చుచే నీకైన
                   శాస్తిని గుర్తించి చనుము వేగ
        వినవేవి నీకిదె విష్ణుచక్రమువచ్చి
                    రూపురేఖలుమార్చి రూపు మాపు
        భక్తుల బాధించు పాపులు వెంటనే
                    ఘోరమౌనిరయాన గూలఁగలరు
       
తే :    అభయ హస్తుడు మాధవుడండ యుండ
           మారుడైనను హరుడైన మ్రందు నిజము
           గాన నాతండ్రి యెడబాయలేను నిన్ను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

10, ఏప్రిల్ 2017, సోమవారం

శ్రీరామ శతకము – 88

సీ :  దీనదయాళుడ దివ్యస్వరూపుడ
                నామొరాలించవా నళిననేత్ర
        దారాసుతాదులు ధారమౌ సంకిళ్లు
                ఆభాసబాంధవు లాప్త వరులు
        చుట్టాలు శత్రువుల్ నట్టేటి నక్రముల్
               అగ్రజుల్ భాగినులు యుగ్రకరులు
        సంసార సంబంధ సంస్రిత మానవుల్
              శార్దూల శునకాది సర్పసములు
       
తే :   ఘోరముగ మీద లంఘించి గోడుగుడువ
           జేయుతరి రుగ్మతయుగూడి చేయుకీడు
           గాన ననుగావు కళ్యాణకర మహాత్మ
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

9, ఏప్రిల్ 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 87

సీ :  వింతనా మారీచు వేయామడల గొట్ట
                ఘనమదాకపిరాజుగాచుటెంత
        పంత మాచుపనాతి పాపిని ద్రోలుట
                గొప్ప నా పూతన గుల్చు టెంత
         తంత్రమాజలరాశి దాటగా నదిఎంత
               బాధ యాజానకి బాయుటెంత
        ఎంత యాశబరి చిరకాలమున బ్రోవ
               పేర దారుక్మిణి పెండ్లి ఎంత
       
తే :    వింతలను గొప్పలివి కావు కొంతలౌను
          పంతముతో నన్ను రక్షించ పాటుపడిన
          సుంత యికలేదు ఘనుడవు శూరుడవును
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

8, ఏప్రిల్ 2017, శనివారం

శ్రీరామ శతకము – 86

సీ :  కాయంబు నమ్మంగ నాయంబె నరునకు
                 పాయును భువియందు పాయ ఋణము
        హేయంబు సంసారకామంబు నిక్కంబు
                 ఆయాసమధికమౌ యాత్మకెపుడు
        ధ్యేయంబుయాత్మకు దివ్యంబు స్థిరమోచు
                  పారాయణము రాముభజన మెపుడు
        సాయంబు నాకౌ నుపాయంబుమది జూడ
                  నారాయణుడె రక్షనయముగాను
       
తే :    ఏయాపాయంబులేదింక యిలను నాకు
           ఆ దయాళుని యెడబాయ ననవరతము
           తండ్రివైరక్షసలుపంగ దగుదువీవు
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

7, ఏప్రిల్ 2017, శుక్రవారం

శ్రీరామ శతకము – 85

సీ :  కరములారా మీరు కమలాక్షు నర్చించి
                 భజనంబుజేయుచు బాగుపడుడు
         నేత్రంబులార యా నీరజాక్షుని రాము
                  కనులార జూచుచు కనుడుసుఖము
         వీనులారా మీరు వేదాంత వేద్యుని
                  విమల చరిత్రంబు వినుడు సతము
         మననమా నీవింక మాధవు స్మరియిOచి
                  గలిగిన కాలంబు గడుపు సుఖము
       
తే :    పాదములు మీరు పరమాత్ముపదము లంట
           పరుగులిడరండు పాపంబు భయమదేల
           భక్తజనులను రక్షించు భవ్య మూర్తి
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి