26, జనవరి 2019, శనివారం

కామం - 10 వ్యసనములు

మనం ఇంతకు ముందు అరిషట్ వర్గముల గురించి చెప్పుకున్నాం! వాటిలో కామం (కోరిక) వలన జనించిన 10 వ్యసనములు గురించి మనువు తన ధర్మశాస్త్రం లొ చెప్పారు. ఆ శ్లోకం ఇప్పుడు చెప్పుకుందాం!
శ్లో : మృగయాక్షా దివాస్వప్నః పరివాదః స్త్రీయో మదః
     తౌర్యత్రికం వృధాట్యా చ కామజోదశకో గణః
భావం : కామం (కోరిక) నుండి పది వ్యసనములు జనించాయి. అవి
  1. వేట
  2. వాదం
  3. పగటి నిద్ర
  4. పరనింద
  5. స్త్రీలతో కూడటం
  6. మధ్యపానం/ మత్తు పదార్ధముల సేవనం
  7. నృత్యాభిలాష
  8. సంగీతాభిలాష
  9. వృధాసంచారం
  10. అకారణం గా ఇతరులను శిక్షించటం

ఇక్కడ ఉన్న అన్ని వ్యసనములలో నృత్యం, సంగీతం మనకు ఉన్న 64 కళలలో కూడా ఉన్నయి. ఇక్కడ మనం గమనించ వలసినది, నృత్యమయినా సంగీతమయినా శాస్త్రబద్దంగా ఉంటాయి. వానిని కళాత్మక దృష్టితో మత్రమే చూడగలిగితే మంచిది, కానీ మరొక దృష్టితో చూడటమేవ్యసనం. 

22, జనవరి 2019, మంగళవారం

21 నరకములు

ఎవరయినా పాపకర్మలు చెస్తే వారు నరకానికి పోతారు అని చెప్తారు. అయితే అపాత్రదానం చెసిన వారే కాకుండా అర్హతలేని వారి వద్ద దానం పుచ్చుకున్నవారికి కూడా నరకం ప్రాప్తిస్తుంది. అయితే ఆ నరకములు 21 అని మనువు తన ధర్మశాస్త్రంలో ఈ క్రింద చెప్పిన శ్లోకంలో చెప్పారు.
శ్లోః        తామి స్రమంధతామిస్రం మహారౌరవరౌరవౌ
నరకంకాలసూరతం చ మహానరమేవచ
సంజీవనం మహావీచిం తపనం సంప్రతాపనమ్
సంఘాతం చసకాకోలం కుడ్మలం పూతిమృత్తికమ్
లోహశంకుపృజీషం చ పంధానం శాల్మలీం నదీమ్
అసిపత్రవనం చైవ లోహదారకమేవ చ
  1.  తామిస్రం
  2. అంధతామిస్రం
  3. మహారౌరవం
  4. రౌరవం
  5. కాలసూత్రం
  6. మహానరకం
  7. సంజీవనం
  8. మహావీచి
  9. తపనము
  10. సంప్రతాపనం
  11. సంఘాతం
  12. కాకోలం
  13. కుడ్మలం
  14. పూతిమృత్తికం
  15. లోహశంకువు
  16. ఋజీషం
  17. పంధనము
  18. శాల్మలి
  19. వైతరణినది
  20. అసిపత్రవనం
  21. లోహదారకం

9, జనవరి 2019, బుధవారం

శ్రీ శివ మహా పురాణం- శ్లోకముల సంఖ్య

మనం ఇంతకు ముందు పురాణములు 18 అని చెప్పుకున్నాం కదా! వానిలో నాలుగవది అయిన శ్రీ శివ మహాపురాణంను ముందుగా స్వయంగా మహాదేవుడే చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆ పురాణము 12 సంహితలుగా చెప్పబడినది. అవి, వానిలోని శ్లోకముల సంఖ్య చుద్దాం!
  1. విద్వేశ్వర సంహిత – 10,000
  2. రుద్ర సంహిత – 8,000
  3. వినాయక సంహిత – 8,000
  4. ఉమా సంహిత – 8,000
  5. మాతృ సంహిత -8,000
  6. ఏకాదశ రుద్ర సంహిత – 13,000
  7. కైలాస సంహిత – 6,000
  8. శతరుద్ర సంహిత - 3,000
  9. కోటి రుద్ర సంహిత – 9,000
  10. సహస్త్ర కోటి రుద్ర సంహిత – 12,000
  11. వాయవీయ సంహిత – 4,000
  12. ధర్మ సంహిత – 12,000


అనగా మొత్తం 1,00,000 ఒక లక్ష శ్లోకములు ఉండేవి. తరువాతి కాలంలో పురాణములు రచించునప్పుడు వేదవ్యాసుడు శివపురాణమును 7 సంహితలుగా 24,000 శ్లోకములతో రచించాడని చెప్తారు. 
అవి 
  1. విద్వేశ్వర సంహిత
  2. రుద్ర సంహిత
  3. శతరుద్ర సంహిత
  4. కోటి రుద్ర సంహిత
  5. ఉమా సంహిత
  6. కైలాస సంహిత
  7. వాయవీయ సంహిత

7, జనవరి 2019, సోమవారం

సప్త గంగలు

మన పురాణములలో చెప్పిన అనేక విషయములలో పరమ పుణ్యమయములని నదులను చెప్తారు. అయితే మనకు ఉన్న అనేక నదులలో తలమానిక మైనది గంగా నది. అయితే ఆ గంగ కు సమాన మయినవి అని చెప్ప బడే ఏడు నదులు ఉన్నయి. వానిని సప్త గంగలు అని చెప్తారు. అవి
  1. గంగ
  2. గోదావరి
  3. కావేరి
  4. తామ్రపర్ణి
  5. సింధు
  6. సరయు
  7. నర్మద

5, జనవరి 2019, శనివారం

శివ లీలలు

ఈ అనంత విశ్వంలో భగవంతుని అనేక రూపములలో మనం ఆరాధిస్తూ ఉంటాము. దేవాధిదేవుడయిన మహాదేవుని  మనం అరూప రూపిగా పూజించటానికి మన పెద్దలు ఎన్నో రూపములు ప్రతిపాదించారు. వానిలో శివుని లీలలుగా 23 రూపములను వర్ణించారు. ఆ 23 శివ లీలలు
  1. సోమస్కంద మూర్తి
  2. కల్యణ సుందర మూర్తి
  3. నటరాజ మూర్తి
  4. వీరభద్ర మూర్తి
  5. శరభ సాళువ మూర్తి
  6. బిక్షాటన మూర్తి
  7. కామారి
  8. ఏకపాదుడు
  9. సుఖావహ మూర్తి
  10. దక్షిణా మూర్తి
  11. విషాపహరణ మూర్తి
  12. కంకాళ మూర్తి
  13. అజారి మూర్తి
  14. హరిహర మూర్తి
  15. త్రిపురాసుర సంహార మూర్తి
  16. లింగోధ్భవ మూర్తి
  17. గణేశానుగ్రహ మూర్తి
  18. చండేశానుగ్రహ మూర్తి
  19. చక్రప్రధాన మూర్తి
  20. కిరాత మూర్తి
  21. అర్ధ నారీశ్వర మూర్తి
  22. వృషభారూఢ మూర్తి
  23. కాలారి

3, జనవరి 2019, గురువారం

ప్రదక్షిణ

మనం ఏ దేవాలయమునకు వెళ్ళినా భగవంతుని దర్శనముతో బాటు తప్పని సరిగా చెసేది ప్రదక్షిణ. మరి ఇంతకీ ప్రదక్షిణ అర్ధం ఏమిటి?
ప్ర – తిరుగుట
 దక్షిణ – కుడి వైపుగా
అంటే భగవంతుడు మనకు కుడి వైపున ఉండేలా తిరుగుట అని ఒక అర్ధం.
మరొక భావం ఎలా చెప్పవచ్చో ఇప్పుడు చుద్దాం
ప్ర – పాపమును శక్తి వంతముగా పోగొట్టునది
ద- కోరిన కోర్కెలు తీర్చునది
క్షి- సకల కర్మలను నశింపజేయునది
ణ – ముక్తిని ప్రసాదించునది


1, జనవరి 2019, మంగళవారం

మానవుడు - ధర్మములు

మన దేశములో మానవులకు అన్నింటికంటే ముఖ్యమయిన భాద్యత ధర్మాన్ని పాటించుట అని చెప్తారు. అయితే ఆ ధర్మములు అనేక రకములు ఉన్నయి. అవి సహజంగా కొన్ని సార్లు సమయమును బట్టి మారుతూ ఉన్నప్పటికీ శాస్త్రం మానవునికి ప్రతిపాదించిన ధర్మములు ముఖ్యంగా 11.
  1. సనాతన ధర్మము
  2. సామాన్య ధర్మము
  3. విశేష ధర్మము
  4. వర్ణాశ్రమ ధర్మము
  5. స్వ ధర్మము
  6. యుగ ధర్మము
  7. మానవ ధర్మము
  8. పురుష ధర్మము
  9. స్త్రీ ధర్మము
  10. రాజ ధర్మము
  11. ప్రమిథి లేదా ప్రాపంచిక ధర్మము
 

ఈ క్రొత్త సంవత్సరం మనందరిలో మరింత మంచితనం నింపాలి, మనం కన్న కలలు నిజం చేసుకునే మార్గం చూపాలి, కొందరికి అయిన మనం కొంత సహాయం చేయగలగాలి, మన జీవితాలలో మరింత మధుర జ్ఞాపకాలు మిగలాలి, మనతో పాటు మన మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు, పరిచయస్తులు, పరిచయంలేనివారు అందరూ సకల సంతోషాలతో ఉండాలి. అందరికీ ఈ ఆంగ్ల సంవత్సరాది మంచి ప్రారంభంకావాలి.   


మన పాత మిత్రుడు 2018 మనకు మిగిల్చిన జ్ఞాపకాలు, అనుభవాలు ఒక్కసారి తలచుకుందాం. ఏమైనా తప్పులు జరిగి ఉంటే సరిదిద్దుకునే ప్రయత్నం చేద్దాం. 2018కు వీడ్కోలు పలుకుదాం. అందరం సంతోషంగా నూతన సంవత్సరం - 2019కి స్వాగతం పలుకుదాం. 

మీ 
దీపిక 

30, డిసెంబర్ 2018, ఆదివారం

ఏకవింశతి ఉపచారములు

దేవాధిదేవుని పుజించే సమయంలో మనం ముఖ్యంగా చేసేవి 21 ఉపచారములు. వానిని ఏకవింశతి ఉపచారములు అంటాము. అవి
  1. ధ్యానం
  2. ఆవాహనం
  3. ఆసనం
  4. పాధ్యం
  5. అర్ఘ్యం
  6. ఆచమనీయం
  7. అభిషేకం
  8. వస్త్రం
  9. భస్మం
  10. గంధం
  11. అక్షతలు
  12. పుష్పములు
  13. బిల్వ పత్రములు
  14. ధూపము
  15. దీపము
  16. నైవేద్యము
  17. తాంబూలము
  18. మహానీరాజనము
  19. మంత్ర పుష్పము
  20. నమస్కారము
  21. ప్రార్ధన

27, డిసెంబర్ 2018, గురువారం

సనాతన ధర్మంలో దేవాలయముల పాత్ర

మన సనాతన ధర్మంలో దేవాలయముల పాత్ర అత్యంత ప్రముఖమైనది. పూర్వకాలంలో దేవాలయములు కేవలం భగవంతుని పూజా స్థలములుగానేకాక అనేక సామాజిక కార్యకలాపాలకు కూడా నెలవులుగా ఉండేవి. ఆ రోజులలో దేవాలయాలు ఏవిధంగా ఉపయోగ పడేవో చుద్దాం!
  1.  వేద విధ్యాలయాలు  :  ఆ రోజులలో ప్రతి దేవాలయంలో అనేక విధ్యార్ధులు నిత్యం వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. వారికి దేవాలయమును మించి మరొక స్థానం అవసరం ఏముంది?
  2.     విధ్యావేత్తల సమావేశములు   :  ఆ రోజులలో శాస్త్ర చర్చలకు, అవధానములకు, పండితుల మద్య వాదములకు దేవాలయములు వేదికలుగా మారేవి
  3.    కళలు  : లలిత కళలకు దేవాలయములు పట్టుకొమ్మలు. నాట్యములు, గానములు, వాద్యములుకు సంబందించిన ప్రతిఒక్కరు దేవాలయములలో తమ ప్రదర్శనలు ఇస్తూండేవారు
  4.    శిలాశాసనములు  : పూర్వ కాలంలో రాజులు తాము చేసిన గొప్ప పనులను, ఆయా దేవాలయములకు చేసిన సేవలను తరువాతి తరముల వారికి అందించే ప్రయత్నంలో భాగంగా దేవాలయములలో శిలాశాసనములు లేదా రాగిపత్రములు వేయించేవారు. కనుక దేవాలయములు మన చరిత్రకు సాక్షులు
  5.   స్థూపములు, శిల్పములు, చిత్రలేఖనం : పైన చెప్పిన శిలాశాసనముల వలెనే ఈ స్థూపములు, శిల్పములు, చిత్రలేఖనం కూడా చరిత్రకు సాక్షములు.. అయితే వీని ప్రముఖ్యం ఆ రాజుల సమయంలో కళల స్వరూపమును మనకు తెలియజేస్తాయి
  6.    గోదాములు : అప్పట్లో దేవాలయముల ఆవరణ చాలా పెద్దగా ఉండుట వల్ల రైతులు ఆ ఆవరణను కొంతమేర ధాన్యమును నిల్వచేసుకునే గోదాములుగా వాడుకునేవారు
  7.   చికిత్సా కేంద్రాలు  : ఆ రోజులలో మనకు ఇప్పుడు ఉన్నట్లుగా వైధ్యశాలలు ఉండేవి కావు. ఆచార్యుల వారి ఇంటిలో లేదంటే దేవాలయంలోనే అన్ని వైద్య సేవలు అందేవి.
  8.    గ్రామ సమావేశములు : ఆయా గ్రామములకు సంబందించిన ముఖ్య విషయముల చర్చలు దేవాలయములు వేదికగా జరిగేవి.
  9. ఎన్నికల కేంద్రములు : ఆయా గ్రామములలో జరిగే ఏ విధమైన ఎన్నికలయినా దేవాలయ ప్రాంగణాములలో జరిగేవి.
  10.  అర్ధిక కార్యకలాపములు  : ఊరికి సంబందించి చేసే ప్రతి కార్యక్రమానికి సంబందించిన ఆర్ధిక పరమైన చర్చలకు, భవిష్య ప్రణాళిక లకు దేవాలయములు కేంద్రములయ్యేవి

ఇన్ని ముఖ్యమయిన పనులు అన్నీ దేవాలయములలోనే జరుగుటకు, అలా జరగాలని నిర్ణయించుటకు ముఖ్యమయిన కారణం పైన చెప్పిన పనులన్నీ ధర్మబద్ధంగా జరగాలనే.

11, ఆగస్టు 2018, శనివారం

పంచకృత్యములు

భగవానుడు ముఖ్యం గా చేసే పనులు ఐదు. వానిని పంచకృత్యములు అంటారు. అవి

  1. సృష్టి : సకల చరాచర జీవుల వృద్ధి ని సృష్టి అంటారు
  2. స్థితి : సృష్టించిన జీవరాశి మనుగడ క్రమశిక్షణ న్యాయాన్యాయ క్రమాక్రమ విచక్షణ భారమును వహించుటను స్థితి అంటారు 
  3. సంహారం : స్థూలరూపంలో ఉన్న  సూక్ష్మీకరించటాన్ని సంహారం అంటారు 
  4.  తిరోభావం : సూక్ష్మీకరించబడిన దానిని తిరిగి స్థూల రూపముగా సృష్టించి వరకూ కాపాడటాన్ని తిరోభావం అంటారు 
  5. అనుగ్రహం : పై నాలుగు స్థితులలో పరిభ్రమించుచున్న జీవుడిని తిరిగి పరమాత్మలో కలుపుకోవటాన్ని అనుగ్రహం అంటారు 

9, ఆగస్టు 2018, గురువారం

శ్రీ మహా విష్ణు రూపములు

భాగవతం మొదలగు పురాణములలో శ్రీ మహా విష్ణు  గురించి వర్ణించ బడినది. అయితే శ్రీ మహా విష్ణు కు ముఖ్యమయినవి, భక్తులను అనుగ్రహించుటకు సులభ మయినవి ఐదు రూపములు ఉన్నాయి. అవి

  1. పర రూపం  : ఈ రూపం శ్రీ వైకుంఠం లో ఉండే విష్ణుమూర్తి 
  2. వ్యూహా రూపం : ఈ రూపం పర రూపం నుండి వచ్చినది. ఇది ప్రాపంచిక సౌఖ్యములను ఇవ్వగలిగినవి,అవి నాలుగు రూపములు అవి 
    • వాసుదేవ 
    • సంకర్షణ 
    • ప్రద్యుమ్న 
    • అనిరుద్ధ  
  3. విభవ రూపము : ఇవి అవతారములు 
  4. అంతర్యామి : సకల చరాచర జీవరాశి ఆత్మలలో ఉండే రూపం 
  5. అర్చా రూపం : ఆ దేవదేవుని మనం కనులతో చూడలేము కనుక వానిని స్థూల రూపం లో ఉంచి పూజించే రూపం 


7, ఆగస్టు 2018, మంగళవారం

ఆంగ్ల మాసములు - రోజులు

మనలో కొందరికి ఇప్పటికీ ఆంగ్ల మాసములలో ఏ మాసమునకు ౩౦ రొజులో, ఏ మాసమునకు 31 రొజులో గుర్తు ఉండవు. దీనికోసం 1892 లోనే శ్రీ M.H. సుబ్బారాయుడు గారు వారు రచించిన “అంకగణితం” అనే పుస్తకంలో ఆ విషయములను గుర్తు ఉంచుకోవటానికి  ఒక పధ్యం రచించారు. ఆ పధ్యం మీకోసం!  

పరగముప్పది దినముల బరగుచుండు
జూను సెప్టెంబరేప్రిలు మానుగాను
తగ నవంబరుతో కూడి తధ్యమరయ
ముప్పదొక్కటి దినములు తప్పకుండ
నలరుచుండును దక్కిన నెలలయందు
ఫిబ్రవరి మూడు వర్షముల భ్రముగను
పిదుపనిరువది తొమ్మిది ఫిబ్రవరికి
నదియె లీపందురాంగ్లేయులనువుగాను

3, ఏప్రిల్ 2018, మంగళవారం

పంచ పాండవులు - పన్నెండు వనములు


మహాభారత కధ మనకు అందరికీ తెలుసు. పంచ పాండవులు జూదంలో ఓడిపోయి పన్నెండు సంవత్సరముల అరణ్యవాసం, ఒక సంవత్సరము అజ్ఞాతవాసం చేసారు అని మనకు తెలుసు కదా! అయితే మనకు తెలియని ఒక చిన్న విషయం వుంది ఆ అరణ్యవాసం కి సంబందించి. అదేమిటంటే, వారు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారు ఒకొక్క సంవత్సరము ఒకొక్క వనంలో నివసించారు. ఆ పన్నెండు వనముల పేర్లు మీకోసం!
  1.  సూర్య వనము·        
  2. రామ ఋషి వనము
  3. మృగ/ మహర్షి వనము
  4. గాలవ మహాముని వనము
  5. సైంధవ మహా ఋషి వనము
  6. కామధేను పర్వతము
  7. గంధర్వ పర్వతము
  8. గురుపర ఋషి వనము
  9. రోమ ఋషి వనము
  10. భౌరుండ వనము
  11. సభా మృగ వనము
  12. కాల భైరవ వనము
ఒకొక్క వనములో ఒకొక్క విచిత్రము, పాండవులకు ఒకొక్క అనుభవము ఎదురయినాయి. వాని గురించి మరొకసారి చెప్పుకుందాము.

30, నవంబర్ 2017, గురువారం

మంచి, చెడు- 3

ధనము నందు అత్యాశ గలిగి ఉండుట కంటే దుర్గుణము లేదు
అబద్ధములు చెప్పుట కంటే పాపము వేరొకటి లేదు - సత్యవాక్కును మించిన తపస్సు లేదు
మనస్సు పవిత్రంగా ఉండుట కంటే గొప్ప తీర్ధము లేదు . సౌజన్యము కు మించి పరివారము లేదు
 మంచి పనులు చేయుట వలన ప్రాప్తిoచిన పరువు అన్నింటి కంటే ప్రకాశమైన అలంకారం
విద్య కంటే విలువ గల ధనము లేదు
లోకనిందను మించి నీచమైన చావు లేదు  

28, నవంబర్ 2017, మంగళవారం

మంచి,చెడు -2

మన పెద్దలు ఏ విషయాన్ని చెప్పినా మంచిని చెడును సమాంతరంగా చెప్తారు. ఒక విషయాన్ని మంచిది అని చెప్తున్నప్పుడు దానికి సంబంధించి చెడుఎలా ఉండవచ్చో కూడా చెప్తారు. ఇటువంటి మంచి చెడుని నిర్వచిస్తున్నప్పుడు వారు ముఖ్యంగా మనిషి సామాజిక బాధ్యతకి ప్రాముఖ్యత ఇచ్చారు. 

అటువంటివి కొన్ని మనం చూద్దాం.

మంచి:  
ఆకలిగొనిన వారల కన్నము పెట్టవలెను
దాహము గలిగిన వారికి దాహశాంతి చేయవలెను
దుఃఖములో ఉన్నవారికి అవసరమయిన సహాయం చేయవలెను ఒకవేళ మన వంతు సహాయం చేయలేక పొతే కనీసం వారికి ఓదార్పు కలిగేలా మసలితే మంచిది.

చెడు : 
పక్కవారి ఆకలిని, దాహమును గమనించకుండా తన భోజనము తాను చేయుట అన్నింటికంటే చెడ్డ పనిగా మన పెద్దలు చెప్పారు.
పక్కవారు దుఃఖంలో ఉన్నప్పుడు వారిని పట్టించుకోకపొతే రేపు అటువంటి సమస్య మనకు కలిగినప్పుడు మనకు సహాయం చేయటానికి ఎవరు వస్తారు?

27, నవంబర్ 2017, సోమవారం

మంచి, చెడు -1

ఈ రోజులలో ఉద్యోగం చేసే టప్పుడు అధికారి దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేదాని గురించి మన పెద్దలు ఏ విధంగా అది   కత్తిమీద సామువంటిదో విపులంగా ఎలాచెప్పారో చూద్దామా!
యజమాని/ అధికారి  దగ్గర ఎక్కువగా మౌనముగా ఉంటే మూగవాడు అంటారు
యజమాని/ అధికారి  దగ్గర  ఎక్కువగా మాట్లాడితే అధిక ప్రసంగి  అంటారు
యజమాని/ అధికారి కి అత్యంత సమీపంగా ఉంటే గర్వితుడు అంటారు
యజమాని/ అధికారితో అంటీ ముట్టనట్లు దూరంగా ఉంటే భయస్తుడు అంటారు
యజమాని/ అధికారి ప్రవర్తనను ప్రశ్నించకుండా భరిస్తుంటే పిరికివారు అంటారు
యజమాని/ అధికారి ముందు తన ఆత్మగౌరవమును కాపాడుకొనే ప్రయత్నం చేస్తే గౌరవము లేని వ్యక్తి అని చెప్పుకుంటారు
కనుక ఉద్యోగము  చేసే దగ్గర మనపని మనం చూసుకోవాలి, మరీ ఎక్కువగా మాట్లాడకుండా, అవసరమైన దగ్గర మాట్లాడకుండా ఉండకుండా మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. 

26, నవంబర్ 2017, ఆదివారం

శ్రీరామ శతకము – 100

సీ  : సీస పద్యములిదొ శ్రీరామ మాలగా 
             గూర్చి మీ కొసగితి కొదువ లేక 
        శత పుష్ప మాలిది సంతసంబున గొని 
             దంపతుల్ ముదమొOద దాల్చరయ్య 
       తావి నిండిన పూల దండలివి మెడదాల్చి 
            చెడిపోవకుండగా జేయరయ్య 
       బీద దాసుడిచ్చు ప్రేమ కానుక గొని 
            మంగళంబులు సామి మాకు నొసగు 
       
తే :   గ్రుడ్డి పూలంచు నిర్గందకుసుమమనుచు
        మనసు నందున రోయక మణిసరాల
        టంచు రామానుజుండిచ్చు హారమిదిగొ
       అందుకొనవయ్య శ్రీరామ వందనములు

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

4, అక్టోబర్ 2017, బుధవారం

శ్రీరామ శతకము – 99

సీ   : చంచరీకము తేనె యంచితంబుగ గ్రోలె
                        పరువెత్తు మందార పాదపముకు
         గాక వేమును గ్రోల కడు నుత్సహించునే
                         కమలాక్ష నాయాత్మ కలత లేక
        నీ పదామృత చింత నెమ్మి మానసమందు
                         లగ్నమై యితరంబులకును జనదు
        సామి మతిభ్రమ జరుగకుండగ బ్రోచి
                        కాపాడు మేవేళ కరుణ తోడ
       
తే :   దాసు యీ కోర్కె దీర్చOగ తగును నీకు
         జనని సీతామ తల్లితో సరగ వచ్చి
         మంగళా శాసనము జేసి మమత తోడ
        అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి

5, జులై 2017, బుధవారం

శ్రీరామ శతకము – 98

సీ   : తనయుడు తండ్రివిధంబు సంబంధంబు
                  జీవేశ్వరుల బంధమవని యందు
          రక్ష్యరక్షక భారరమ్యమౌబంధము
                  నారాయణునకును నరునకెపుడు
         శేషశేషిత్వముల్ చేతనేశ్వరులకు
                 చెవులుగా బంధమై నిలిచియుండు
       భర్త్రుభార్యాబంధ పావన బందము
                  పరమాత్మ నాత్మకు పరుగు నెపుడు
       
తే :   ఆత్మ యాత్మీయ బంధంబు లనగా
           నవ విధంబులఁ బాంధవ్య మనకుం
           వాడె నీవౌట నిన్నింక వదలలేను
          అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !

                                    - శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి