27, డిసెంబర్ 2018, గురువారం

సనాతన ధర్మంలో దేవాలయముల పాత్ర

మన సనాతన ధర్మంలో దేవాలయముల పాత్ర అత్యంత ప్రముఖమైనది. పూర్వకాలంలో దేవాలయములు కేవలం భగవంతుని పూజా స్థలములుగానేకాక అనేక సామాజిక కార్యకలాపాలకు కూడా నెలవులుగా ఉండేవి. ఆ రోజులలో దేవాలయాలు ఏవిధంగా ఉపయోగ పడేవో చుద్దాం!
  1.  వేద విధ్యాలయాలు  :  ఆ రోజులలో ప్రతి దేవాలయంలో అనేక విధ్యార్ధులు నిత్యం వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. వారికి దేవాలయమును మించి మరొక స్థానం అవసరం ఏముంది?
  2.     విధ్యావేత్తల సమావేశములు   :  ఆ రోజులలో శాస్త్ర చర్చలకు, అవధానములకు, పండితుల మద్య వాదములకు దేవాలయములు వేదికలుగా మారేవి
  3.    కళలు  : లలిత కళలకు దేవాలయములు పట్టుకొమ్మలు. నాట్యములు, గానములు, వాద్యములుకు సంబందించిన ప్రతిఒక్కరు దేవాలయములలో తమ ప్రదర్శనలు ఇస్తూండేవారు
  4.    శిలాశాసనములు  : పూర్వ కాలంలో రాజులు తాము చేసిన గొప్ప పనులను, ఆయా దేవాలయములకు చేసిన సేవలను తరువాతి తరముల వారికి అందించే ప్రయత్నంలో భాగంగా దేవాలయములలో శిలాశాసనములు లేదా రాగిపత్రములు వేయించేవారు. కనుక దేవాలయములు మన చరిత్రకు సాక్షులు
  5.   స్థూపములు, శిల్పములు, చిత్రలేఖనం : పైన చెప్పిన శిలాశాసనముల వలెనే ఈ స్థూపములు, శిల్పములు, చిత్రలేఖనం కూడా చరిత్రకు సాక్షములు.. అయితే వీని ప్రముఖ్యం ఆ రాజుల సమయంలో కళల స్వరూపమును మనకు తెలియజేస్తాయి
  6.    గోదాములు : అప్పట్లో దేవాలయముల ఆవరణ చాలా పెద్దగా ఉండుట వల్ల రైతులు ఆ ఆవరణను కొంతమేర ధాన్యమును నిల్వచేసుకునే గోదాములుగా వాడుకునేవారు
  7.   చికిత్సా కేంద్రాలు  : ఆ రోజులలో మనకు ఇప్పుడు ఉన్నట్లుగా వైధ్యశాలలు ఉండేవి కావు. ఆచార్యుల వారి ఇంటిలో లేదంటే దేవాలయంలోనే అన్ని వైద్య సేవలు అందేవి.
  8.    గ్రామ సమావేశములు : ఆయా గ్రామములకు సంబందించిన ముఖ్య విషయముల చర్చలు దేవాలయములు వేదికగా జరిగేవి.
  9. ఎన్నికల కేంద్రములు : ఆయా గ్రామములలో జరిగే ఏ విధమైన ఎన్నికలయినా దేవాలయ ప్రాంగణాములలో జరిగేవి.
  10.  అర్ధిక కార్యకలాపములు  : ఊరికి సంబందించి చేసే ప్రతి కార్యక్రమానికి సంబందించిన ఆర్ధిక పరమైన చర్చలకు, భవిష్య ప్రణాళిక లకు దేవాలయములు కేంద్రములయ్యేవి

ఇన్ని ముఖ్యమయిన పనులు అన్నీ దేవాలయములలోనే జరుగుటకు, అలా జరగాలని నిర్ణయించుటకు ముఖ్యమయిన కారణం పైన చెప్పిన పనులన్నీ ధర్మబద్ధంగా జరగాలనే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి