22, జనవరి 2022, శనివారం

చ్యవన మహర్షి

చ్యవన మహర్షి భృగుమహర్షి కుమారుడు. ఇతని ప్రస్తావన మనకు భాగవతం మరియు మహాభారతంలో కూడా కనిపిస్తుంది. 
శర్యాతి అనే మహారాజు ఒకసారి తనసైన్యంతో, కుటుంబంతో వనములలోనికి మహర్షుల సేవకోసం వెళ్లారు. కొన్ని రోజుల తరువాత వారి సైన్యంలోనివారికి మలమూత్రస్థంభన జరిగింది. సైన్యం మొత్తం బాధింపబడటం చుసిన శర్యాతికి అలా జరగటానికి కారణం తెలియలేదు. 
అప్పుడు అతని కుమార్తె సుకన్య అంతకు ముందు రోజు జరిగిన సంగతి చెప్పింది. 
ముందురోజు ఆమె తన స్నేహితురాళ్లతో కలసి వనవిహారమునకు వెళ్ళింది. అప్ప్పుడు ఒక చెట్టు మొదట్లో ఒక పెద్ద పుట్ట కనిపించింది. ఆ పుట్టాను దగ్గరగా చూడాలన్న కుతూహలంతో సుకన్య అక్కడికి వెళ్ళింది. ఆ పుట్టలో నుండి ఆమెకు రెండు చిన్న మెరుపులు కనిపించాయి. మిణుగురు పురుగులేమో అనుకుని, అవునోకాదో చూడాలనుకుని ఒక కర్రపుల్లతో వానిని పొడిచింది. అయితే ఆ పోటుకు అక్కడినుండి రక్తం ప్రవహించింది. ఆ రక్తాన్ని చూసి భయపడిన సుకన్య తిరిగి వచ్చేసింది. 
ఇప్పుడు తమ సైన్యం పడుతున్న బాధలను చూసి తన తండ్రికి విషయం చెప్పింది. ఈ విషయం విన్న శర్యాతి తిరిగి వనంలో తన కుమార్తె చెప్పిన ప్రదేశమునకు వెళ్లి  జరిగిందో తెలుసుకుని బాధపడ్డాడు. 
తన కూతురు పొడిచిన ఆ రెండు మిణుగురులు చ్యవన మహర్షి కన్నులు. ఆ మహర్షికి బాధను కలిగించిన కారణంగానే వారి సైన్యమునకు కష్టములు వచ్చాయి అని తెలుసుకుని, చ్యవన మహర్షిని క్షమాపణ కోరుకున్నాడు శర్యాతి. 
జరిగిన తప్పుకు ప్రాయఃచిత్తంగా తన కుమర్తె సుకన్యను అతనికి ఇచ్చి వివాహం చేసాడు. 
ఆ తరువాత సుకన్య జీవితం ఎలా ఉంది, ఏం జరిగింది అని తరువాతి టపాలో చూద్దాం!

2 కామెంట్‌లు:

  1. హాయ్. మీరు బాగా చేస్తున్నారు కానీ మీ బ్లాగ్ గూగుల్‌లో ర్యాంక్ కాదు, మీరు సరైన మార్గంలో SEO చేస్తే మీ బ్లాగ్ గూగుల్‌లో ర్యాంక్ పొందుతారు and change template also

    రిప్లయితొలగించండి