5, మార్చి 2016, శనివారం

ప్రదోష కాలం - శివ పూజ


ఒకప్పుడు దేవదానవులు అమృతం కోసం వాసుకిని త్రాడుగా చేసుకుని మంధర గిరిని కవ్వం చేసుకుని పాలసముద్రం చిలికారు. ఆ సమయంలో ముందుగా హాలాహలం  వచ్చింది. అప్పుడు వారందరూ మహాదేవుని శరణు వేడారు. అప్పుడు కరుణాసాగరుడయిన మహాదేవుడు వారిని మన్నించి ఆ విషమును స్వీకరించి, త్రాగి, దానిని తన గొంతులోనే నిలుపుకున్నాడు. దాని కారణంగా శివుని కంఠం నల్లగా మారినది. కనుకనే అతనికి నీలకంఠుడు అని పేరు వచ్చింది.
తరువాత దేవదానవులు మళ్లీ తిరిగి  మధనం మొదలుపెట్టారు.  అప్పుడు వారికి క్రమంగా అన్ని రత్నములు లభిస్తూ చివరగా ద్వాదశి రోజున వారికి అమృతం లభించింది. అమితానందం పొందిన దేవతలు నీలకంఠుని కనీసం తలచకుండా, ఆతనికి ధన్యవాదములు తెలుపుట మరచి పోయారు. మరునాడు అనగా త్రయోదశి రోజు వారు చేసిన తప్పు వారికి తెలిసివచ్చింది. వెంటనే వారు భోళాశంకరుని వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారట. వారిని క్షమించేసిన పరమ శివుడు నందీశ్వరుని కొమ్ముల మధ్యలో ఆనందతాండవం చేసారట. కనుక ఆ సమయాన్ని ప్రదోష కాలం అంటారు. ఈ సమయంలో శివుని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయి అని పెద్దలు చెప్తారు.
ఈ ప్రదోష కాలంలో శివునికి ఏ పదార్ధంతో అభిషేకం చేస్తే ఏ ఫలితం వస్తుందో చూద్దాం!

పాలు  - దీర్ఘాయువు
నెయ్యి - మోక్షం
పెరుగు - సత్ సంతానం
తేనె     - మధురమైన/ శ్రావ్యమైన స్వరం
బియ్యపు పిండి - ఋణముల నుండి విముక్తి
చెరకు రసం - ఆరోగ్యం
పంచామృతం - ధన వృద్ధి
చక్కర - శతృవినాశనం
అన్నం - సుఖ వంతమైన జీవితం
చందనం - లక్ష్మీ కటాక్షం
నిమ్మ - మృత్యు భయం తొలగుతుంది

ఓం నమః శివాయ 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి