30, డిసెంబర్ 2018, ఆదివారం

ఏకవింశతి ఉపచారములు

దేవాధిదేవుని పుజించే సమయంలో మనం ముఖ్యంగా చేసేవి 21 ఉపచారములు. వానిని ఏకవింశతి ఉపచారములు అంటాము. అవి
  1. ధ్యానం
  2. ఆవాహనం
  3. ఆసనం
  4. పాధ్యం
  5. అర్ఘ్యం
  6. ఆచమనీయం
  7. అభిషేకం
  8. వస్త్రం
  9. భస్మం
  10. గంధం
  11. అక్షతలు
  12. పుష్పములు
  13. బిల్వ పత్రములు
  14. ధూపము
  15. దీపము
  16. నైవేద్యము
  17. తాంబూలము
  18. మహానీరాజనము
  19. మంత్ర పుష్పము
  20. నమస్కారము
  21. ప్రార్ధన

27, డిసెంబర్ 2018, గురువారం

సనాతన ధర్మంలో దేవాలయముల పాత్ర

మన సనాతన ధర్మంలో దేవాలయముల పాత్ర అత్యంత ప్రముఖమైనది. పూర్వకాలంలో దేవాలయములు కేవలం భగవంతుని పూజా స్థలములుగానేకాక అనేక సామాజిక కార్యకలాపాలకు కూడా నెలవులుగా ఉండేవి. ఆ రోజులలో దేవాలయాలు ఏవిధంగా ఉపయోగ పడేవో చుద్దాం!
  1.  వేద విధ్యాలయాలు  :  ఆ రోజులలో ప్రతి దేవాలయంలో అనేక విధ్యార్ధులు నిత్యం వేదాధ్యయనం చేస్తూ ఉండేవారు. వారికి దేవాలయమును మించి మరొక స్థానం అవసరం ఏముంది?
  2.     విధ్యావేత్తల సమావేశములు   :  ఆ రోజులలో శాస్త్ర చర్చలకు, అవధానములకు, పండితుల మద్య వాదములకు దేవాలయములు వేదికలుగా మారేవి
  3.    కళలు  : లలిత కళలకు దేవాలయములు పట్టుకొమ్మలు. నాట్యములు, గానములు, వాద్యములుకు సంబందించిన ప్రతిఒక్కరు దేవాలయములలో తమ ప్రదర్శనలు ఇస్తూండేవారు
  4.    శిలాశాసనములు  : పూర్వ కాలంలో రాజులు తాము చేసిన గొప్ప పనులను, ఆయా దేవాలయములకు చేసిన సేవలను తరువాతి తరముల వారికి అందించే ప్రయత్నంలో భాగంగా దేవాలయములలో శిలాశాసనములు లేదా రాగిపత్రములు వేయించేవారు. కనుక దేవాలయములు మన చరిత్రకు సాక్షులు
  5.   స్థూపములు, శిల్పములు, చిత్రలేఖనం : పైన చెప్పిన శిలాశాసనముల వలెనే ఈ స్థూపములు, శిల్పములు, చిత్రలేఖనం కూడా చరిత్రకు సాక్షములు.. అయితే వీని ప్రముఖ్యం ఆ రాజుల సమయంలో కళల స్వరూపమును మనకు తెలియజేస్తాయి
  6.    గోదాములు : అప్పట్లో దేవాలయముల ఆవరణ చాలా పెద్దగా ఉండుట వల్ల రైతులు ఆ ఆవరణను కొంతమేర ధాన్యమును నిల్వచేసుకునే గోదాములుగా వాడుకునేవారు
  7.   చికిత్సా కేంద్రాలు  : ఆ రోజులలో మనకు ఇప్పుడు ఉన్నట్లుగా వైధ్యశాలలు ఉండేవి కావు. ఆచార్యుల వారి ఇంటిలో లేదంటే దేవాలయంలోనే అన్ని వైద్య సేవలు అందేవి.
  8.    గ్రామ సమావేశములు : ఆయా గ్రామములకు సంబందించిన ముఖ్య విషయముల చర్చలు దేవాలయములు వేదికగా జరిగేవి.
  9. ఎన్నికల కేంద్రములు : ఆయా గ్రామములలో జరిగే ఏ విధమైన ఎన్నికలయినా దేవాలయ ప్రాంగణాములలో జరిగేవి.
  10.  అర్ధిక కార్యకలాపములు  : ఊరికి సంబందించి చేసే ప్రతి కార్యక్రమానికి సంబందించిన ఆర్ధిక పరమైన చర్చలకు, భవిష్య ప్రణాళిక లకు దేవాలయములు కేంద్రములయ్యేవి

ఇన్ని ముఖ్యమయిన పనులు అన్నీ దేవాలయములలోనే జరుగుటకు, అలా జరగాలని నిర్ణయించుటకు ముఖ్యమయిన కారణం పైన చెప్పిన పనులన్నీ ధర్మబద్ధంగా జరగాలనే.

11, ఆగస్టు 2018, శనివారం

పంచకృత్యములు

భగవానుడు ముఖ్యం గా చేసే పనులు ఐదు. వానిని పంచకృత్యములు అంటారు. అవి

  1. సృష్టి : సకల చరాచర జీవుల వృద్ధి ని సృష్టి అంటారు
  2. స్థితి : సృష్టించిన జీవరాశి మనుగడ క్రమశిక్షణ న్యాయాన్యాయ క్రమాక్రమ విచక్షణ భారమును వహించుటను స్థితి అంటారు 
  3. సంహారం : స్థూలరూపంలో ఉన్న  సూక్ష్మీకరించటాన్ని సంహారం అంటారు 
  4.  తిరోభావం : సూక్ష్మీకరించబడిన దానిని తిరిగి స్థూల రూపముగా సృష్టించి వరకూ కాపాడటాన్ని తిరోభావం అంటారు 
  5. అనుగ్రహం : పై నాలుగు స్థితులలో పరిభ్రమించుచున్న జీవుడిని తిరిగి పరమాత్మలో కలుపుకోవటాన్ని అనుగ్రహం అంటారు 

9, ఆగస్టు 2018, గురువారం

శ్రీ మహా విష్ణు రూపములు

భాగవతం మొదలగు పురాణములలో శ్రీ మహా విష్ణు  గురించి వర్ణించ బడినది. అయితే శ్రీ మహా విష్ణు కు ముఖ్యమయినవి, భక్తులను అనుగ్రహించుటకు సులభ మయినవి ఐదు రూపములు ఉన్నాయి. అవి

  1. పర రూపం  : ఈ రూపం శ్రీ వైకుంఠం లో ఉండే విష్ణుమూర్తి 
  2. వ్యూహా రూపం : ఈ రూపం పర రూపం నుండి వచ్చినది. ఇది ప్రాపంచిక సౌఖ్యములను ఇవ్వగలిగినవి,అవి నాలుగు రూపములు అవి 
    • వాసుదేవ 
    • సంకర్షణ 
    • ప్రద్యుమ్న 
    • అనిరుద్ధ  
  3. విభవ రూపము : ఇవి అవతారములు 
  4. అంతర్యామి : సకల చరాచర జీవరాశి ఆత్మలలో ఉండే రూపం 
  5. అర్చా రూపం : ఆ దేవదేవుని మనం కనులతో చూడలేము కనుక వానిని స్థూల రూపం లో ఉంచి పూజించే రూపం 


7, ఆగస్టు 2018, మంగళవారం

ఆంగ్ల మాసములు - రోజులు

మనలో కొందరికి ఇప్పటికీ ఆంగ్ల మాసములలో ఏ మాసమునకు ౩౦ రొజులో, ఏ మాసమునకు 31 రొజులో గుర్తు ఉండవు. దీనికోసం 1892 లోనే శ్రీ M.H. సుబ్బారాయుడు గారు వారు రచించిన “అంకగణితం” అనే పుస్తకంలో ఆ విషయములను గుర్తు ఉంచుకోవటానికి  ఒక పధ్యం రచించారు. ఆ పధ్యం మీకోసం!  

పరగముప్పది దినముల బరగుచుండు
జూను సెప్టెంబరేప్రిలు మానుగాను
తగ నవంబరుతో కూడి తధ్యమరయ
ముప్పదొక్కటి దినములు తప్పకుండ
నలరుచుండును దక్కిన నెలలయందు
ఫిబ్రవరి మూడు వర్షముల భ్రముగను
పిదుపనిరువది తొమ్మిది ఫిబ్రవరికి
నదియె లీపందురాంగ్లేయులనువుగాను

3, ఏప్రిల్ 2018, మంగళవారం

పంచ పాండవులు - పన్నెండు వనములు


మహాభారత కధ మనకు అందరికీ తెలుసు. పంచ పాండవులు జూదంలో ఓడిపోయి పన్నెండు సంవత్సరముల అరణ్యవాసం, ఒక సంవత్సరము అజ్ఞాతవాసం చేసారు అని మనకు తెలుసు కదా! అయితే మనకు తెలియని ఒక చిన్న విషయం వుంది ఆ అరణ్యవాసం కి సంబందించి. అదేమిటంటే, వారు అరణ్యవాసం చేస్తున్న సమయంలో వారు ఒకొక్క సంవత్సరము ఒకొక్క వనంలో నివసించారు. ఆ పన్నెండు వనముల పేర్లు మీకోసం!
  1.  సూర్య వనము·        
  2. రామ ఋషి వనము
  3. మృగ/ మహర్షి వనము
  4. గాలవ మహాముని వనము
  5. సైంధవ మహా ఋషి వనము
  6. కామధేను పర్వతము
  7. గంధర్వ పర్వతము
  8. గురుపర ఋషి వనము
  9. రోమ ఋషి వనము
  10. భౌరుండ వనము
  11. సభా మృగ వనము
  12. కాల భైరవ వనము
ఒకొక్క వనములో ఒకొక్క విచిత్రము, పాండవులకు ఒకొక్క అనుభవము ఎదురయినాయి. వాని గురించి మరొకసారి చెప్పుకుందాము.