సీ : దీన రక్షక దేవ దీన దయాళుడ
నీనామ స్మరణంబె నేను జేతు
పుడమి యందేమి యేభువనమందున్నను
నరక మందున్నను నళిన నాభ
స్వర్గమందున్నను వైకుంఠముననున్న
పాతాళమందున్న పద్మనాభ
ఎచట నేనున్నను ఇసుమంత భయమొOద
నిన్నే స్మరించుచు నిలువగలను
తే : పాపి జారుడు చోరుడు పరమ నీచు
డంచు మదినెంచి యెడబాయ నెంచితేని
పాదములు రెండు గట్టిగ పట్టుకొనెద
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
నీనామ స్మరణంబె నేను జేతు
పుడమి యందేమి యేభువనమందున్నను
నరక మందున్నను నళిన నాభ
స్వర్గమందున్నను వైకుంఠముననున్న
పాతాళమందున్న పద్మనాభ
ఎచట నేనున్నను ఇసుమంత భయమొOద
నిన్నే స్మరించుచు నిలువగలను
తే : పాపి జారుడు చోరుడు పరమ నీచు
డంచు మదినెంచి యెడబాయ నెంచితేని
పాదములు రెండు గట్టిగ పట్టుకొనెద
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి