సీ : నారాయణుడు
తానెనరునకొసంగెను
మంత్రరాజము మున్ను
బదరియందు
ద్వయమంత్రమొసగెను
వైకుంఠపురమందు
పెరియ పిరాట్టికి
ప్రేమతోడ
చరమంబు కృపజేసెకురుభూమియందున
పార్ధుండుదీనుడైప్రణుతిజేయ
తత్వత్రయంబిట్లు
తానె యాచార్యుడై
వివిధస్థలంబుల
విశదపరచె
తే : గురుడునీమంత్రముల నెల్లకోర్కెనీయ
భక్తి భజియించు
వారికిముక్తి గలుగు
ననుచుభోధించు
యాచార్యుడీవెగాన
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు!!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి