సీ : నేనెంత వేడినా
నీకేల దయరాదు
భక్తవత్సల దీన భయవిదూర
నేనెంత బిలచినా
నీవేల పలుకవు
కరిరాజు వెతదీర్చు కమలనాభ
నేనెంత తలచినా
నీవేల కనరావు
గోపికా ప్రియదర్శ గోపబాల
నేనెందుజూచినా
నీ జాడకనరాదు
ప్రహ్లాదుగాచిన
పరమ పురుష
తే : కుబ్జవెతలను దీర్చిన కూర్మిసఖుడ
చింతయంత్యను
గోపిక చింతదీర్చు
నాధనన్నిదె రక్షించు
నళిన నేత్ర
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి