సీ : సర్వేశ నీ గొప్ప సౌందర్యమునుజూసి
శ్రీలక్ష్మి మైమర్చి సేవజేయు
నవనీత హృదయంబునకు
మేటియౌనన
వక్షస్థలంబందు
వాసమొందె
సతి ధర్మమునుదెల్ప
పతిని విదువక తానె
సకల కైంకర్యముల్
సలుపునెపుడు
భక్తులు యేతెంచి
భయపడి పోకుండ
నిత్యాన పాయియై
నిలచియుండు
తే : జనని జానకి
మాతల్లి చనువుచేత
పురుషకారము జేయును
నరులబ్రోవ
దయను శిక్షించుతొ
రక్షించుతొ తరిమి కొడుతొ
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి