అత్రి మహాముని ధర్మ పత్ని అనసూయ. వారిది ఆదర్శ దాంపత్యం. అత్రి మహామునికి సంతానం కావని కోరిక కలిగినది. సంతానం కోసం జగత్తుని నిండిన పరమాత్మ గురించి తపస్సు చేసాడు. అతని పరిక్షించదలచిన త్రిమూర్తులు అతని ముందు ప్రత్యక్షమై తమలో ఎవరి గురించి తపస్సు చేస్తున్నావు అని అడిగారు. సర్వం తెలిసిన అత్రి మహర్షి పరమాత్మ గురించి అని సమాధానం చెప్పాడు. అతని జ్ఞానానికి సంతోషించిన బ్రహ్మ,విష్ణు,మహేశ్వరులు ఏమి వరం కావాలి అని అడుగగా వారి అంశలతో తనకు పుత్రులు కావాలని కోరాడు. త్రిమూర్తులు తధాస్తు అని వెళ్లిపోయారు.
కొంతకాలానికి అనసూయకు ముగ్గురు పుత్రులు జన్మించారు.
వారు
- చంద్రుడు - బ్రహ్మ అంశ
- దత్తాత్రేయుడు - విష్ణు భగవానుని అంశ
- దుర్వాసుడు - మహాదేవుని అంశ
బ్రహ్మాండ పురాణం ప్రకారం వీరు మనం ఇప్పుడు ఉన్న వైవస్వత మన్వంతరంలో నే 10 వ మహాయుగం, త్రేతాయుగకాలంలో సంభవించారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి