పాండవులైన ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు లకు ద్రౌపది యందు జన్మించిన ఐదుగురు పుత్రులను మనం ఉపపాండవులు అంటాము. వీరు ఒకొక్క సంవత్సరo వయో భేదం తో జన్మించారు. వీరు మహారధులు.
ప్రతివింధ్యుడు: శత్రువులను వింధ్య పర్వతం వలే ఎదుర్కొనగలడు గనుక ఇతనికి ప్రతివింధ్యుడు అని పేరు పెట్టారు.
సుతసోముడు: భీముడు వెయ్యి సోమయాగాలు చేసిన తర్వాత సూర్యచంద్రుల తేజస్సు తో కలిగిన పుత్రుడు కనుక ఇతనికి సుతసోముడు అని పేరు పెట్టారు.
శృతకర్ముడు: అర్జునుడు తాను ఎన్నో ఘనకార్యములు చేసిన తర్వాత పుట్టిన వాడు కనుక ఇతనికి శృతకర్ముడు అని పేరు పెట్టారు.
శతానీకుడు : తమ కౌరవవంశ రాజర్షి ఐన శతానీకుని పేరు నకులుడు తన పుత్రునికి అనందం గా పెట్టుకున్నారు.
శ్రుతసేనుడు: ఇతను కృత్తిక నక్షత్రం లో జన్మించాడు కనుక శ్రుతసేనుడు అని పేరు పెట్టారు.
- ధర్మరాజు పుత్రుడు ప్రతివింధ్యుడు
- భీమసేనుడి పుత్రుడు సుతసోముడు
- అర్జునుని పుత్రుడు శృతకర్ముడు
- నకులుని పుత్రుడు శతానీకుడు
- సహదేవుని పుత్రుడు శ్రుతసేనుడు
ప్రతివింధ్యుడు: శత్రువులను వింధ్య పర్వతం వలే ఎదుర్కొనగలడు గనుక ఇతనికి ప్రతివింధ్యుడు అని పేరు పెట్టారు.
సుతసోముడు: భీముడు వెయ్యి సోమయాగాలు చేసిన తర్వాత సూర్యచంద్రుల తేజస్సు తో కలిగిన పుత్రుడు కనుక ఇతనికి సుతసోముడు అని పేరు పెట్టారు.
శృతకర్ముడు: అర్జునుడు తాను ఎన్నో ఘనకార్యములు చేసిన తర్వాత పుట్టిన వాడు కనుక ఇతనికి శృతకర్ముడు అని పేరు పెట్టారు.
శతానీకుడు : తమ కౌరవవంశ రాజర్షి ఐన శతానీకుని పేరు నకులుడు తన పుత్రునికి అనందం గా పెట్టుకున్నారు.
శ్రుతసేనుడు: ఇతను కృత్తిక నక్షత్రం లో జన్మించాడు కనుక శ్రుతసేనుడు అని పేరు పెట్టారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి