మనం ఇంతకు ముందు విదురనీతి అనే శీర్షికలో కొన్ని భాగములు చెప్పుకున్నాం కదా! ఇంతకు ముందు భాగములలో విదురుడు పండితులు అని ఎవరిని అనాలో చెప్తున్నాడు, ఈ భాగం ఆ భాగములకు కొనసాగింపు అంతే కాకుండా పండితులకు ఉండే ముఖ్య లక్షణముల గురించి తెలుసుకుందాం!
సంస్కృత శ్లోకం:
నాప్రాప్యమభివాంచంతి నష్టం నేచ్ఛన్తి శోచితుం
ఆపత్సు చ న ముహ్యంతి నరాః పండిత బుద్ధయః
శ్రీ మల్లాది సూర్యనారాయణ శాస్త్రి గారు రచించిన తెలుగు పద్యంః
పోయిన దానికిదాదల పోయడశక్యార్ధములకుబోడాపదలన్
బాయడు ధైర్యముదీనుల రోయడుతత్వజ్ఞుడగునరుండు మహీశా!
భావంః పండితుడు తను పొందలేక పోయినదాని గురించి దుఃఖించడు, తనకు సాధించడానికి అసాధ్యమయిన లక్ష్యములను సాధించాలని కోరుకొనడు, తన లక్ష్యములను సాధించే క్రమంలో ఎదురయిన సమస్యలను చూసి ధైర్యమును కోల్పోడు, అంతే కాకుండా తన ముందు ఎవరయినా ధైర్యమును కోల్పోయిన వారిని అనాదరించడు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి