మనం ఇంతకుముందు భృగుపుత్రుడయిన చ్యవన మహర్షి గురించి, అతను శర్యాతి పుత్రిక సుకన్యను వివాహం చేసుకున్న సందర్భాన్ని కదా! ఇప్పుడు ఆ తరువాత జరిగిన సంగతులు తెలుసుకుందాం!
అత్యంత కోప స్వభావం కలిగిన చ్యవనుని రాజపుత్రిక సుకన్య వివాహం చేసుకున్న తరువాత, మారిపోయింది. ఎంతో ఓర్పుతో, సహనంతో ఆమె పర్ణశాలలో జీవనం సాగించింది. భర్త అనురాగమును పొందింది. అలా కొంతకాలం గడచిపోయింది.
ఒకరోజు చ్యవన మహర్షి ఆశ్రమం దగ్గరకు అశ్వినీ దేవతలు వచ్చారు. వారు సుకన్యను చూసి ఆమె ఎవరు అని అడిగారు. ఆమె పుత్రికను అని,చ్యవన మహర్షి భార్యను అని చెప్పింది. ఆమె మాటలు విన్న అశ్వినీదేవతలు అంతముసలి వానితో జీవనం సాగించటం ఎందుకు? ఆమె సౌందర్యానికి తగినట్లుగా మంచి యౌవ్వనం కలిగిన వీరుని వరించుకొమ్మని,కావాలంటే వారే అతనిని తీసుకుని వచ్చి ఆమెకు అతనితో వివాహం చేస్తామని చెప్పారు.
వారి మాటలు విన్న సుకన్య, తాను చ్యవన మహర్షితో ఎంతో సంతోషంగా ఉన్నాను అని చెప్పి, వారిని వారించి తన భర్త దగ్గరకు వెళ్లి జరిగిన సంగతి అంతా విన్న చ్యవన మహర్షి ఆమెను వెళ్ళి ఆ అశ్వినీ దేవతలను వరం కోరుకొమ్మని సలహా ఇచ్చారు. భర్త కోరిక మేరకు తిరిగి ఆ అశ్వినీ దేవతలా వద్దకు వెళ్లి ఆమె భర్తనే (చ్యవన మహర్షినే) యవ్వనం కలిగినా వానిగా చేయమని కోరుకుంది.
ఆమె కోరిక తీరిందా? అశ్వినీ దేవతలు నిజంగా ఆమెకు సహాయ చేయగలిగారా? తిరిగి ఏమి పొందారు అని తరువాతి టపాలలో చూద్దాం!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి