మనం ఇంతకుముందు మానవుడు తప్పని సరిగా చేయవలసిన పంచమహాయజ్ఞముల గురించి తెలుసుకున్నాం కదా! దానిలో అతిధి యజ్ఞం అద్భుతంగా చేసిన ఒక బ్రాహ్మణుని కధ ఇప్పుడు చూద్దాం!
పూర్వాకాలంలో కురుక్షేత్రం ప్రాంతంలో సక్తుప్రస్తుడు అనే పేరు కలిగిన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి కోరికలు ఏమీలేవు. అతనితో పాటుగా అతని భార్య, కొడుకు ,కోడలు కూడా అదేవిధమయిన భక్తి వైరాగ్యములు కలిగి ఉండేవారు. వారు ఉంచ్చవృత్తి చేస్తూ జీవించేవారు. వారు కేవలం పొలంలో రాలిన, ఎవ్వరూ ఆశించని ధాన్యమును ఏరుకుని తెచ్చుకుని దానిని మాత్రమే తిని జీవిస్తారు.
ఒకసారి వానలు సరిగా పడక పంటలు సరిగా పండక, ఆ ప్రాంతంలో కరువు సంభవించింది. వీరికి ఆహారం దొరకటం చాలా కష్టం అయ్యిపోయింది. వారు నలుగురు తెచ్చిన ఆహారఎం వారికి సరిపోయేది కాదు.
అల ఒకరోజు వారికి కొంత ధాన్యం దొరికింది. అది సాయంత్రానికి వారి భోజనానికి తయారు చేసుకున్నారు. ఆ రోజు చేయవలసిన శాస్త్రోక్తకర్మలను పూర్తిచేసుకుని వారు భోజనం చేయటానికి ఆ ఆహారాన్ని నలుగురూ సమంగా పంచుకుని తినబోతున్న సమయంలో వారి ఇంటికి ఒక అతిధి వచ్చారు. ఆ అతిథికి సకల మర్యాదలు చేసి, కుశల ప్రశ్నలు అడిగిన తరువాత, అతనికి మామగారు తన వంతు భోజనాన్ని అందించాడు. అతిధి ఆ ఆహారాన్ని స్వీకరించాడు. కానీ అతనికి ఆ ఆహారం అతనికి సరిపోలేదు అని ఆ బ్రాహ్మణుడు గమనించాడు. కానీ వచ్చిన అతిథిని ఇంకా ఎలా సంతృప్తిపరచాలో అతనికి తెలియక చూస్తున్న సమయంలో, అతని భార్య తనవంతు భోజనాన్ని అతిథికి ఇచ్చింది. అది కూడా అతనికి సరిపోకపోతే అతని కుమారుడు, ఆ తరువాత వారి కోడలు కూడా వారి వారి భోజనాన్ని పరం సంతోషంగా వచ్చిన అతిథికి సమర్పించారు . అలా అందరూ ఇచ్చిన ఆహారాన్ని బుభుజించిన ఆ అతిథి సంతృప్తుడు అయ్యాడు.
అలా సంతృప్తుడయిన ఆ అతిథి, భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పుతో కూడిన మర్యాద, దయ, అతిధులయందు ప్రేమ అన్ని ఉన్న ఆ బ్రాహ్మణ కుటుంబానికి తను యముడిని అని చెప్పి తన్మ నిజరూపమును చూపించాడు . అంతే కాక వీరి దానగుణమును సకల దేవతలు, సప్తఋషులు కూడా ఆశ్చర్యపోతున్నారు అని చెప్పాడు. దేవతలు వారి మీద పుష్పవర్షం కురిపించారు. యముడు వారిని బ్రహ్మ తనలోకమునకు తీసుకువెళ్ళేందుకు విమానమును పంపిస్తాడు అని చెప్పాడు. ఆలా చెప్తూ ఉండగానే ఒక విమానం వచ్చింది. అప్పుడు యముడు వారిని ఆ విమానంలో ఎక్కమని చెప్పాడు. వారు ఆ విమానంలో ఎక్కి బ్రహ్మలోకమునకి వెళ్లారు.
ఆ కుటుంబం మొత్తం విమానంలో బ్రహ్మలోకమునకు వెళుతున్న సమయంలో వచ్చిన కోలాహలం విన్న ఒక ముంగీస కలుగులో నుండి బయటకు వచ్చి చూస్తూ ఉండగా , ఆ అతిధిగా వచ్చిన యముడు చేతులు కడుగుకున్న నీటిని ఆ ముంగీస సగంశరీరం తాకుటవల్ల ఆ ముంగీస సగం శరీరం బంగారు వర్ణం లోనికి మారింది. ఇంట ఘనంగా దానం చేసిన ఫలములో కొంత భాగం తనకు దక్కినది అని తలచి ఆ ముంగీస మిగిలిన శరీరమును బంగారు వర్ణంగా మార్చుకోవటానికి దానములు జరిగే ప్రతి చోటుకూ వెళ్లి వారు చేతులు కడుగుకునే స్థలంలో తిరుగుతూ ఉండేది.

Very useful
రిప్లయితొలగించండి