ఇంతకూ ముందు మనం కొన్ని అద్భుతమయిన తెలుగు పద్యముల గురించి చెప్పుకున్నాం కదా! వానిలో ఒక పద్యం కవిరాజ శిఖామణి నన్నెచోడుడు రచించిన కుమారా సంభవం లోని ఒక పద్యం చూసాం కదా!! ఇప్పుడు అదే కుమారా సంభవం లోని మరొక పద్యం చూద్దాం!
ఈ పద్యం ప్రార్ధనలోని భాగం. ఈ పద్యమునకు అర్ధం రెండురకములుగా చూద్దాం!
తన జనకుడురుస్థాణువు
జనని యపర్ణాఖ్య దా విశాఖుo డనగా
దనరియు నభిమతఫలముల
జనులకు దయ నొసగుచుండు షణ్ముఖు గొలుతున్
- భావం: తనతండ్రి కదలలేని ఒక మొద్దు, తల్లి కి ఆకులే లేవు, అతనికి కొమ్మలు కూడా లేవు, కానీ కోరినకోర్కెలు తీర్చే ఆరు ముఖములు కలిగినవానికి నమస్కరిస్తున్నాను.
- భావం: ప్రళయకాలంలో కూడా చెదరనివాడు అతనికి తండ్రి, తపస్సుకోసం కనీసం ఆకులు కూడా ముట్టనిది అతని తల్లి, వారినుండి సాహసమును, సహనమును పొందిన విశాఖుడు అయ్యి, ఎవరు కోరినకోర్కెలు అయినా దయతో తీర్చేవాడయిన షణ్ముఖునకు నమస్కారం.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి