ఇప్పుడు అతనికి దిక్పాలత్వం, ధనాధిపత్యం ఎలా సంక్రమించింది, లంక కు అధిపతి ఎలా అయ్యాడు అని తెలుసుకుందాం!
వైశ్రవణునికి తండ్రి విశ్రవసునివలెనే ధర్మాచరణ పరాయణుడు. అతను అనేక సంవత్సరములు
తపస్సు చేసాడు. వెయ్యి సంవత్సరములు తపస్సు చేసిన తరువాత అతను కేవలం గాలిని మాత్రమే పేల్చి తపస్సు చేసాడు. ఆ ఘోరమయిన తపస్సుని చూసి దేవతలు ఆశ్చర్యపోయిఅందరూ బ్రహ్మదేవునిలో కలసి అతనికి దర్శనం ఇచ్చారు. అప్పుడు బ్రహ్మదేవుడు అతనిని వరం కోరుకోమని అడుగగా, అతను దిక్పాలత్వమును, ముల్లోకముల లోని ధనము పైన ఆధిపత్యము కావలి అన్ని కోరుకున్నాడు. అప్పటివరకు కేవలం ముగ్గురు దిక్పాలకులు ఉన్నారు. ఇంద్ర, వరుణ మరియు యముడు. అప్పుడు బ్రహ్మ అతనిని ఉత్తర దిక్కునకు అధిపతిని చేసాడు. అంతే కాక అతనికి ధనాధిపత్యం కూడా ఇచ్చారు. వానితో పాటు ఆటను అన్ని లోకములు తిరుగుటకు వీలుగా అద్భుతమయిన ఒక విమానము కూడా ఇచ్చారు. ఆ విమానం పేరే పుష్పక విమానం! దీని ప్రత్యేకత ఎంతమంది ఎక్కినా ఇంకా కొందరు ఎక్కటానికి చోటు ఉంటుంది.
ఆ వరములను పొందినతరువాత వైశ్రవణుడు తన తండ్రి దగ్గరకు వెళ్లి తాను పొందిన వరములా గురించి చెప్పి, తాను ఉండుటకు వీలుగా ఒక ప్రదేశం చూపించమని అడిగాడు. అప్పుడు విశ్రవసుడు ఆ సమయమునకు కాళీ గా ఉన్నస్వర్ణ లంకా నగరమును తనకు నివాసంగా మార్చుకోమని చెప్పాడు.
అప్పటి నుండి వైశ్రవణుడు లంకను తన నగరంగా మార్చుకుని అక్కడ నివాసం ఉన్నాడు.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి