లంకలో సీతాదేవిని వెతుకుటకు వచ్చిన హానానుమంతుడు ఎంత జాగ్రత్తగా వెతుకుతున్నాడో ఇంతకు ముందు ఒక చక్కని పద్యంలో చూశాం కదా!
అలా వెదుకుతున్న హనుమంతుడు లంక అంతా కలియదిరిగి, సీత జాడ తెలియక వెదుకుతూ రావణుని పుష్పక విమానం వద్దకు వచ్చి ఆ విమానపు సౌందర్యానికి, కాంతికి తనను తాను మరచి అలాగే నిలుచుండి పోయాడు.
అప్పుడు అతనిని తిరిగి కార్యోన్ముఖుడ్ని చేయటానికి సాక్షాత్తు పార్వతీదేవి చిన్న పాప రూపంలో వచ్చింది అని మల్లెమాల రామాయణం లో కవి వర్ణించారు.
చిన్న పాపగా వచ్చిన పార్వతీదేవి అలాగే బొమ్మలా నిలబడిన హనుమంతుని విచిత్రంగా చూసి అతని కన్నులలోకి ఉఫు అని ఊదినది. వెంటనే తేరుకుని హనుమంతుడు తన తప్పును వెంటనే గ్రహించి క్షమాపణ అడిగాడు. దానికి బాల రూపంలో ఉన్న పార్వతి, ఎవరయినా ఇంత సౌందర్యము కల్గిన ఈ పుష్పక విమానమును చూసి తమను తాము మరిచిపోవుట సహజం అని చెప్పి ఆ పుష్పక విమానం కథను చెప్పటం మొదలుపెట్టింది.
ముందుగా బ్రహ్మదేవుని కొరకు విశ్వకర్మ చేసాడు. దాని తరువాత అత్యంత తపస్సు చేసిన ధనాధిపతి అయిన కుబేరుడు దీనికి అధిపతి అయ్యాడు. ఆ తరువాత యుద్ధంలో కుబేరుడిని ఓడించిన రావణుడు దీనిని స్వాధీనం చేసుకున్నాడు అని ఆ పుష్పక విమానం కథను చక్కగా హనుమంతునకు సాక్షాత్తు పార్వతి దేవి చెప్పింది. అలా పార్వతి చెప్పిన మాటలు విని హనుమంతుడు ఆమెకు నమస్కారం చేసి, సీతని వెదకుటకు ఆ పుష్పక విమానంలోకి ప్రవేశించారు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి