రామాయణం సాక్షాత్తు వేదం అని చెప్తారు.
పరమాత్మ వేదవేద్యుడు. అంటే పరమాత్మ కేవలం వేదముల ద్వారానే తెలియదగినవాడు. అలాగే వేదములు కేవలం పరమాత్మగురించి మాత్రమే చెప్తాయి. కానీ ఒకసారి పరమాత్మ హఠాత్తుగా తన నామ,రూప, స్థానములను మార్చుకుని దశరథాత్మజుడు అయ్యాడట. అతని రూప, నామ , స్థానములు తెలియని వేదం సతమతమయ్యి అతని కోసం వెతికినదట. ఎక్కడ వెతకాలి తెలియక కవి మరియు ఋషి అయిన వాల్మీకి దగ్గరకు వచ్చిందట. అయితే పరమాత్మ రామునిగా ఉన్న విషయం తెలిసిన వాల్మీకి వేదము యొక్క రూపమును ఒక కావ్యముగా మార్చినాడట.
వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేసాదాసీత్ సాక్షాద్రామాయణాత్మనా!
పరమాత్మ వేదవేద్యుడు. అంటే పరమాత్మ కేవలం వేదముల ద్వారానే తెలియదగినవాడు. అలాగే వేదములు కేవలం పరమాత్మగురించి మాత్రమే చెప్తాయి. కానీ ఒకసారి పరమాత్మ హఠాత్తుగా తన నామ,రూప, స్థానములను మార్చుకుని దశరథాత్మజుడు అయ్యాడట. అతని రూప, నామ , స్థానములు తెలియని వేదం సతమతమయ్యి అతని కోసం వెతికినదట. ఎక్కడ వెతకాలి తెలియక కవి మరియు ఋషి అయిన వాల్మీకి దగ్గరకు వచ్చిందట. అయితే పరమాత్మ రామునిగా ఉన్న విషయం తెలిసిన వాల్మీకి వేదము యొక్క రూపమును ఒక కావ్యముగా మార్చినాడట.
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి