మనం
ఇంతకు ముందు పురాణములు 18 అని చెప్పుకున్నాం కదా! వానిలో నాలుగవది అయిన శ్రీ శివ మహాపురాణంను
ముందుగా స్వయంగా మహాదేవుడే చెప్పాడు. ఆయన చెప్పినప్పుడు ఆ పురాణము 12 సంహితలుగా చెప్పబడినది.
అవి, వానిలోని శ్లోకముల సంఖ్య చుద్దాం!
- విద్వేశ్వర సంహిత – 10,000
- రుద్ర సంహిత – 8,000
- వినాయక సంహిత – 8,000
- ఉమా సంహిత – 8,000
- మాతృ సంహిత -8,000
- ఏకాదశ రుద్ర సంహిత – 13,000
- కైలాస సంహిత – 6,000
- శతరుద్ర సంహిత - 3,000
- కోటి రుద్ర సంహిత – 9,000
- సహస్త్ర కోటి రుద్ర సంహిత – 12,000
- వాయవీయ సంహిత – 4,000
- ధర్మ సంహిత – 12,000
అనగా మొత్తం
1,00,000 ఒక లక్ష శ్లోకములు ఉండేవి. తరువాతి కాలంలో పురాణములు రచించునప్పుడు వేదవ్యాసుడు శివపురాణమును 7 సంహితలుగా 24,000 శ్లోకములతో రచించాడని చెప్తారు.
అవి
- విద్వేశ్వర సంహిత
- రుద్ర సంహిత
- శతరుద్ర సంహిత
- కోటి రుద్ర సంహిత
- ఉమా సంహిత
- కైలాస సంహిత
- వాయవీయ సంహిత
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి