సీ : ధర్మంబు నాల్గు పాదంబుల నడచెను
కృతయుగ మందెంచు వెతలు లేక
మూడు పాదంబుల ముఖ్యమౌ ధర్మము
త్రేతాయుగంబున ప్రీతి నడచె
రెండు పాదములౌచు నుండును ధర్మంబు
ద్వాపరంబుననట్లు వాసిగాంచె
ఏక పాదము ధర్మమీరీతి నుండగా
కలియుగంబున నెందు కలహమొందు
తే : జారచోరత్వమవినీతి జవము గల్గికృతయుగ మందెంచు వెతలు లేక
మూడు పాదంబుల ముఖ్యమౌ ధర్మము
త్రేతాయుగంబున ప్రీతి నడచె
రెండు పాదములౌచు నుండును ధర్మంబు
ద్వాపరంబుననట్లు వాసిగాంచె
ఏక పాదము ధర్మమీరీతి నుండగా
కలియుగంబున నెందు కలహమొందు
ధర్మచింతయు భక్తియు ధర నశించు
కలియుగంబందు నన్నింక కరుణనేలి
అందువుకొనవయ్య శ్రీరామ వందనములు !
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి