సీ : పాపంబులను
జేసి పరితపించుట యేల
పతితపావనుడు
తాప్రాపుగాగ
కర్మంబులనుజేసి
కడు దుఃఖ పడనేల
కలుషంబులను బాపు
ఘనుడు గలుగ
రుజ బాధలంజూచి
రోధించ నది యేల
రంజించు జానకీ
రమణుడుండ
ఆలుబిడ్డలజూచి
అలమటించుట యేల
ఆవేదనల బాపు
హరియెగాన
తే : చిత్తమా నీవు
దుఃఖంబు జెందుటెట్లు
అంతరాత్మలొ హరి
యుండి ఆదుకొనును
నేడు నాబాధలను
దీర్చ నిన్నెగొలుతు
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి