సీ : సరసిజ నయనుండు
శంఖ చక్రధరుండు
దివ్య సుందరమూర్తి
దేవ విభుడు
దరహాస వదనుడు
యురమందు శ్రీవత్స
చిహ్నంబు గలవాడు
శ్రీధరుండు
రత్న కిరీటంబు
రమణీయముగ నొప్ప
శిరమున దాల్చెడు
శ్రీ సఖుండు
కనకంపు చేలంబు
గట్టుచుండెడి వాడు
మేఘవర్ణముబోలు
మేను వాడు
తే : అభయ హస్తమునిడు
తన యాశ్రితులకు
పాదపద్మములను
జూపి భయము బాపి
నేడునను రక్ష
సలుపంగ నిలచినావు
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి