సీ : వేడ్కతో గూర్చుండ వేంచేయగల వేని
హృదయ పీఠమునిత్తు కొదువలేక
కూర్మిచే పూజల గొనగ వచ్చెదవేని
అంజలి పుష్పములమరనిత్తు
పాద్యమింపుగ గొన భ్రమసివచ్చెదవేని
కరమొప్ప కన్నీట గడుగ గలను
వేదస్తోత్రద్వనుల్ వినగ వచ్చెదవేని
దీనాతి రావముల్ విన్నవింతు
తే : నాకున్నంత వానిలో నీకు నిడెద
దయను
నేజేయు సేవలు తనివిదీర
గైకొనగ
రమ్ము కరుణను గరుడవాహ
అందుకొనవయ్య శ్రీరామ వందనములు!!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి