సీ : విత్తమార్జన జేయ వెంగలి నైచెడి
బద్దాత్మలకు నేను బానిసైతి
జ్ఞానమార్జింపను హీనుండ మతిచెడి
దుర్జనంబులగూడి ధూర్తనైతి
ధర్మార్జనముజేయ ధారిణి గతిజెడి
వేదబాహ్యుల గూడి విఫలునైతి
మోక్షమునార్జింప మూఢునై గురి జెడి
నాస్తికులనుగూడి నాశమైతి
తే : పుడమి నెచటను శాంతిని బొందలేక
మాటిమాటికి దోషముల్ మదన పెట్ట
నిన్ను జేరితి నాతండ్రి నన్ను విడక
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి