సీ : గజరాజు మొరయిడకాచిరక్షించుట
దబ్బరయని నేనదలతునయ్య
ద్రౌపది మొరవినిదయతోడ బ్రొచుట
కల్లయంచని నెంతు నుల్లమందు
ప్రహ్లాదుగాపాడ పరుగెత్తి పోవుట
అంతహుళక్కియే యందునయ్య
మునుజటాయువునకు ముక్తినిచ్చుటయన
వట్టిదంచును నెంతు వారిజాక్ష
తే : కుబ్జశబరుల
నార్తిపోగొట్టుటెల్ల
అదియబద్దము స్రీరామయవనినాధ
నేడుననుబ్రోవ నవియెల్లనిక్కమగును
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి