సీ : మంత్రరత్నము
నెప్డుమదిలోన ధ్యానించ
బలురోగ సంఘముల్ బాసిపోవు
మంత్రరత్నము నెప్డుమదిలోన ధ్యానించ
ఈషణత్రయభీతిలేక తొలగు
మంత్రరత్నము నెప్డుమదిలోన ధ్యానించ
సంసారబమ్ధమే సమసిపోవు
మంత్రరత్నము నెప్డుమదిలోన ధ్యానించ
ఆభిజాత్యములెల్ల నంతమొందు
తే : మంత్రరత్నమునేనింక మరవనయ్య
నిర్భరత్వమునీయందు నిలిపితయ్య
దాసుకైంకర్యమిదియని తలపవయ్య
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
- శ్రీ తిరుకోవలూరు రామానుజస్వామి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి