సీ : నాతల్లి దండ్రివి నా యిష్ట దైవమా
నాతోడు నీడవు నాగశయన
నాకర్త భర్తవునా కల్పవృక్షమా
భుక్తి ముక్తి నొసంగు పుణ్యపురుష
నానాధనాయకా నాకామధేనువా
రక్ష్య రక్షకభార రమ్యవేష
నాగురు దైవము నాభాగ్యదేవతా’
మంత్రార్ధ భోధక మాన్యచరిత
తే : పరమపదనాధ కృపజూడు పద్మనాభ
నిన్నెనమ్మితి బ్రోవుము నన్నువిడకు
మెల్లవేళల భారంబు చెల్లనీక
అందుకొనవయ్య శ్రీరామ వందనములు !!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి