సీ : మంత్రాంతరంబుల మనసు నిల్పితిగాని
తిరుమంత్ర వైభవం బెరుగనైతి
సాధనాంతరముల
సాధింప నెంచితి
సిద్ధిసాధన పొందు చెందనైతి
అన్యయుపాయాల
నాశించెదను గాని
నారాయణుని నాత్మ నమ్మనైతి
మనుజమాత్రుల
సేవ మమత జేసితిగాని
గురువుల భక్తితో గొలువనైతి
తే : ఆత్మవంచన పనులెన్నోయమరజేసి
ఎందు దరిదాపు గానక పొందుగోరి
నిన్నె నమ్మితి నీయాన నిజముగాను
అందుకొనవయ్య శ్రీరామ వందనములు
!!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి