సీ : పంచ సంస్కార సంపన్నుడు గాకెట్లు
విష్ణుదాసుల చెల్మి వేగచేయు
నేను
నాదనుటను మానకుండగ నెట్లు
సాత్విక సహవాస సౌఖ్యమొదవు
నారాయిర
స్తోత్రములు చేయకుండెట్లు
జ్ఞానము ప్రాప్తించు మానవునకు
తత్వత్రయంబందు
తగు నిష్ట లేకెట్లు
ముక్తికాంత వరించి మురిసి పడును
తే : ప్రేమ నాచార్యు చేపట్టి కామము దిగి
భాగవతధర్మ
దాస్య నిర్భరత నున్న
ముక్తి
నరచేతికిత్తువు మోదమునను
అందుకొనవయ్య
శ్రీరామ వందనములు !!
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి