మనకు 18 పురాణాలు ఉన్నాయి. వీటిని వినే వారికి, చదివే వారికి కలిగే ఒక ముఖ్యమైన సందేహం "మనకు ఉన్న ఈ పురాణాలు ఒకదానితో ఒకటి కొన్ని విషయాలలో విభేదిస్తున్నాయి కదా! అలా ఎందుకు?" అని. మరి దీనికి మనకి నిజంగా సమాధానం ఇవ్వగలమా?
ఈ ప్రశ్నకు సమాధానం పద్మ పురాణం లో ఇవ్వబడినది.
ఈ ప్రశ్నకు సమాధానం పద్మ పురాణం లో ఇవ్వబడినది.
క్వచిత్క్వచిత్పురాణేషు, విరోధో యది దృశ్యతే
కల్ప భేదాది భిస్తత్ర, వ్యవస్థా సధ్బిరిష్యతే
ఈ శ్లోకం పద్మ పురాణంలో పాతాళ ఖండంలో చెప్పబడి ఉన్నది. దీనికి భావం
" ఆయా పురాణాలలో మనకు కనిపించే భేదములకు కారణం ఆయా పురాణములు ఆయా కల్పములలొ జరిగిన విధమును చెప్పుటయే"
ప్రతి కల్పములో ఈ సంఘటనలు పునరావృతం అవుతాయి. ఐతే అవి అన్ని సార్లు ఒకేలా జరిగి ఉండక పోవచ్చు. కనుక ఏ పురాణం ఏ కల్పంలో చెప్ప బడినదో అది ఆ కల్పంలో జరిగిన విధమును మనకు చెప్తుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి