శివశర్మ తనవద్దకు తన రెండవకుమారుడయిన వేదశర్మ తలతో వచ్చిన స్త్రీ ని చూసి, ఆమె చెప్పిన వృత్తాంతం అంతా విన్నాడు. ఈ వృత్తాంతం అంతా విన్న మిగిలిన పుత్రులు వేదశర్మ చేసిన త్యాగం గురించి ఆశ్చర్యపోయారు.
అప్పుడు శివశర్మ తన మూడవ పుత్రుడయిన ధర్మశర్మను పిలిచి, వేదశర్మను బ్రతికించమని కోరాడు.
తండ్రి మాటలు విన్న ధర్మశర్మ తక్షణం కన్నులు మూసుకుని, తండ్రి ఆదేశించిన విధంగా, యమధర్మరాజును ప్రార్ధించాడు.
అతని ప్రార్ధనను మన్నించి సమవర్తి ఆతనిముందు ప్రత్యక్షం అయ్యాడు. ఆతను కోరిన కోరిక ఏదయినా తీరుస్తాను అని చెప్పాడు. ఆమాటలు విన్న ధర్మశర్మ "ఓ యమధర్మరాజా! మీరు నా భక్తిని మెచ్చినట్లయితే, ఈనా సోదరుని వెంటనే బ్రతికించండి అని కోరెను. " ఆతని కోరిక విన్న యమధర్మ రాజు, మీ పితృభక్తి ఆతనికి ఆయుషు పోయగలదు అని చెప్పి అదృశ్యం అయ్యాడు.
అప్పుడు వేదశర్మ నిద్రలోనుండి మేలుకొన్న విధంగా, లేచి నిలుచున్నాడు. తనతండ్రిని, ఆ స్త్రీని చూసి, వారికి పాదాభి వందనం చేసాడు. ఈ విధంగా శివ శర్మ తన మూడవ కుమారుని పితృభక్తిని పరీక్షించాడు.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి