శివశర్మ జ్యేష్ట పుత్రుని పరీక్ష ముగిసిన వెంటనే, ద్వీతీయ పుత్రుడయిన వేదశర్మని పిలిపించెను. అతనితో "పుత్రా ! నేను నిత్య కర్మలయందు కొంచెం కూడా ఆలస్యం చేయక ఉందును. ఈ నాడు మీ తల్లి లేదు. నిత్య కర్మలు చేయుటకు నేను ధర్మపత్నితో ఉండుట అవసరం, మరియూ నాకు ఇంకనూ సంపూర్ణ వైరాగ్యం కలుగలేదు. నేను ఇప్పుడే ఒక చంద్ర వదనను ఆ విధిలో వెళుతుండగా చూసాను. ఆమెను తెచ్చి నాకు పత్నిగా చేయుము." అని చెప్పెను. తమ తండ్రి చెప్పిన మాటలు విన్న వేదశర్మ ఒక్క క్షణంలో వీదిలోనికి వచ్చి తండ్రి చెప్పిన ఆ స్త్రీని కనుగొని అంజలి ఘటించి "తల్లీ ! మా తండ్రిగారు తమరిని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నారు, కావున తమరు నాతో దయచేసి వారిని వివాహం చేసుకొనండి." అని చెప్పెను.
ఆ స్త్రీ వేదశర్మతో " నేను కన్యను, ఒక ముసలివానిని ఎందుకు వివాహం చేసుకోవాలి? వృధ శరీరం అనేకములయిన వ్యాధులకు ఆలవాలం. నేను నీ తండ్రిని వివాహం చేసుకోను, కానీ నిన్ను చేసుకుంటాను." అని చెప్పినది.
ఆమె మాటలు విని వేదశర్మ " అమ్మా! క్షమించాలి. మీరు నా తండ్రి మనస్సు గెలిచిన వారు. మీరు వారిని వరించిన సర్వ జగమ్ములు మీకు వశంలో ఉండేటట్లు చేయగలవాడను. నేను పలికిన ఒక్క మాటకూడా ఏనాడు తప్పదు." అని తలవంచి మరలా నమస్కరించెను.
ఆమాటలు విన్న ఆ స్త్రీ " ఓ బ్రాహ్మణోత్తమా! నిజంగా మీకు అంత శక్తి ఉన్నట్లయితే, ఇప్పుడే నాకు సమస్త దేవతలను చూపించుము. అప్పుడు మీ మాటలు నేను నమ్ముతాను. " అని పలికినది.
ఆమె అలా అడుగ గానే వేదశర్మ మనస్సులో ధ్యానం చేసాడు. ఆటను అలా ధ్యానం చేయగానే సకల దేవతలు వచ్చి వారిరువురికీ దర్శనం ఇచ్చి, ఆతనిని వరం కోరుకొనమని అడుగగా, వేదశర్మ " సకల దేవతలారా మీరు నాయెడల ప్రసన్నులయిన నాకు అవిచ్చిన్న మయిన పితృభక్తి ని ప్రసాదించండి" అని కోరెను. అప్పుడు ఆ దేవతలు ఆ తనిని అట్లే దీవించి అంతర్ధానం చెందారు.
ఆతని పితృభక్తి ని చూచి ఆమె, " ఓ బ్రాహ్మణోత్తమ! నీకు గల పితృభక్తి అమోఘం. నీవు నన్ను నీ మాతృ స్థానంలో ఉంచాలని అనుకున్నందుకు సంతోషం. కానీ మరి నీ మాతృభక్తికి పరిక్ష ఇవ్వవా ?" అని అడిగినది.
ఆ మాటలు విని అనందం పొందిన వేదశర్మ ఆమె ఏ పరీక్ష పెట్టినా తాను ఎదుర్కోనగాలను అని చెప్పగా, ఆమె అతనిని తన చేతులతో, స్వయంగా తలను నరుక్కొని ఆమె చేతికి ఇవ్వమని కోరినది.
మరుక్షణం వేదశర్మ పరమ సంతోషంతో తన తలను తన చేతులతో నరికి ఆమె చేతికి అందించెను.
ఆతని తలను చేతితో పట్టుకుని ఆ స్త్రీ శివశర్మ ఇంటికి వెళ్లి జరిగిన వృత్తాంతం అంటా వివరించెను.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి