బలరాముడు అవతార పురుషుడు. స్వయంగా ఆదిశేషుని అవతారం. మరి అటువంటి అవతార పురుషుడు ఎలాంటి తప్పు చేసాడు? మరి దాని నుండి ఎలా బయట పడగలిగాడు?
బలరాముడు కురుక్షేత్ర యుద్ధం సమయంలో తీర్ధయాత్రలకు వెళ్ళాడు. తనతో పాటు 10,000ల మంది ఉత్తమ బ్రాహ్మణులను వెంట తీసుకుని వెళ్ళాడు. అలా అన్ని తీర్ధములు తిరిగి వస్తూ నైమిశారణ్యం వైపుకు వెళ్లారు. అలా వెళుతూ ఉండగా దారిలో, ఎవరో ఒకరు ఎదురుపడి బలరామునకు కొంత కల్లును ఇచ్చారు. బలరాముడు ఆ కల్లును స్వీకరించారు. నైమిశారణ్యమునకు చేరేసరికి, అక్కడ రోమహర్షనుడు బ్రహ్మ స్థానం లో కూర్చుని పురాణములను అనేక మంది ఋషులకు, మునులకు చెప్తూ ఉన్నాడు. బలరాముడు అక్కడకు వచ్చుట చూసి, పురాణములను వింటూ ఉన్న మునులు, ఋషులు వారికి ఎదురు వెళ్లి వారికి అతిధి మర్యాదలు చేసారు. ఒక్క రోమహర్షణుడు తప్ప మిగిలిన అందరూ తమను గౌరవించుట చుసిన బలరాముని ఆలోచనల మీద ఇంతకు ముందు తీసుకున్న కల్లు ప్రభావం చేసినది. ఆపలేని కోపంతో రోమహర్షణుడు తనను అవమానించాడని, అతనిని తన నాగలితో బ్రహ్మ స్థానంనుండి క్రిందికి లాగి వేసి, తన రోకలితో అతని తలపై ఒక్క దెబ్బ వేసాడు. మరుక్షణం రోమహర్షణుడు మరణించాడు. అప్పుడు కల్లు ప్రభావం తగ్గటం వల్ల బలరామునికి తను చేసిన తప్పు తెలిసినది.
అప్పటి వరకు చంద్రుని కాంతి వలే తెల్లగా ప్రకాశించే తెల్లని దేహం కలిగిన బలరాముని దేహం ఆ బ్రహ్మహత్య కారణంగా,. ఒక్కసారిగా అత్యంత నల్లగా మారిపొయినది. అప్పుడు తనకు కలిగిన బ్రహ్మహత్యా పాపమునుండి విముక్తి ఎలా కలుగుతుంది అని అక్కడ ఉన్న ఋషులను, మునులను అడిగాడు. అప్పుడు అక్కడ ఉన్న ఋషులు చనిపోయిన రోమహర్షుని బ్రతికించమని కోరారు. కాని తాను చంపిన వ్యక్తిని మరలా బ్రతికించుట సాధ్యం కాదు. కాని తన ఆత్మబలం చేత అతనికి శాశ్వతంగా బ్రహ్మలోకం ఇప్పించగలను, అతని ఆయుష్షు ను మేధా శక్తి నీ అతని కుమారునకు సంక్రమించేలా చేయగలను అని బలరాముడు రోమహర్షునకు బ్రహ్మలోక ప్రాప్తిని కలిగించాడు. మరి ఇక పురాణములు చెప్పే భాద్యతను రోమహర్షుని కుమారుడైన సూతమహామునికి అప్పగించారు.
ఈ కార్యములు చేయుట వల శరీరం మొత్తం నల్లగా మారిన బలరాముని శరీరం లో కొంత బాగం మాత్రమే (కేవలం నుదురు భాగం) తెల్లాగా మారినది. అంటే తను చేసిన పాపమునకు ఇంకా పారిహారం కాలేదు అని తెలుసుకుని ఇంకా ఏమి చేయాలి అని అడిగాడు. అప్పుడు ఋషులు తమను పల్వలుని బారినుండి కాపాడమని కోరారు.
బలరాముడు పల్వలుని సంహరించిన తరువాత తాని శరీరం తలవరకూ తెల్లగా మారినది. మరి మిగిలిన శరీర నలుపు ఏవిధంగా పోగొట్టుకోగలను అని అడుగగా, ఋషులు అతనిని తీర్ధయాత్రలు చేయమని చెప్పారు.
అలా అనేక తీర్ధములు తిరిగి కొంచెం కొంచెం తన శరీరం లోని నలుపును పోగొట్టుకుంటూ చివరకు రామేశ్వరంలో పూర్తిగా తన బ్రహ్మ హత్యా దోషమును పోగొట్టు కున్నాడు.
అప్పుడు బలరాముడు తీర్ధయాత్రలు చేసే వారు నియమ నిష్టలతో చేయాలి అని నియమం చేసాడు.
idi kothagaa undi, inthaku mundu theliyadu.
రిప్లయితొలగించండి