6, సెప్టెంబర్ 2014, శనివారం

ఇందీవరాక్షుడు

ఇందీవరాక్షుడు ఒక విద్యాధరుడు. నలనాభుని పుత్రుడు. అతనికి బ్రహ్మమిత్ర అనే ,ముని శాపం వల్ల బ్రహ్మరాక్షసునిగా మారిపోయాడు. అలా ఎందుకు జరిగినది?
బ్రహ్మమిత్ర ముని వద్ద ఆయుర్వేద విధ్య ఉన్నది అని తెలుసుకుని అతని వద్దకు వెళ్లి ఆ ఆయుర్వేద విద్యను తనకు ప్రసాదించమని అడిగాడు. కాని విధ్యాధరులకు ఆ విద్య ఉపదేశించుట నియమములకు విరుద్దం అని భావించిన బ్రహ్మమిత్రుడు ఇందీవరాక్షునికి ఆ విధ్యన్ను ఇవ్వటానికి ఇష్టపడలేదు. 
అయినా తాను పొందాలనుకున్న విద్యను ఎలాగయినా సాధించాలని అనుకున్న ఇందీవరాక్షుడు అదృశ్యరూపంలో ముని ఆశ్రమం లో నివసించసాగాడు. ఆ ముని తన శిష్యులకు ఉపదేశిస్తున్న సమయం లో అతనుకూడా ఆ విద్యను పొందుతూఉన్నాడు. ఇలా 8 నెలల కాలం గడిచినది. అప్పుడు సంపూర్ణ ఆయుర్వేద జ్ఞానమును పొందిన ఆనందంలో తనను తాను మరచిపోయి నవ్వటం మొదలుపెట్టాడు. ఆ నవ్వును విన్న మునీశ్వరుడు జరిగిన విషయం తెలుసుకుని ఇందీవరాక్షుని బ్రహ్మరాక్షసుడిని కమ్మని శపించాడు. వెంటనే తన కోపమును అదుపు చేసుకుని అతనికి శాపవిమోచనం కూడా చెప్పాడు. ఇందీవరాక్షుడు  7 రోజులలో బ్రహ్మరాక్షసునిగా మారిపోయాడు. 
ఒక రోజు ఇందీవరాక్షుని కుమార్తె మనోరమను ఒక తపస్వి బ్రహ్మరాక్షసునిచే తినబడుగాక అని శపించాడు. స్వయంగా ఇందీవరాక్షుడే తన కుమార్తె ఐన మనోరమను వెంబడించాడు. అలా ఆమె కొన్తదూరం వెళ్ళిన తరువాత ఆమె వరూధిని పుత్రుడైన స్వరోచిని శరణు వేడినది. అప్పుడు అతను అగ్నిబాణమును ప్రయోగించగా ఇందీవరాక్షునికి శాప విమోచనం కలిగినది.  
అతని, అతని కుమార్తె మనోరమ శాప విమోచనం కలిగించిన స్వరోచికి కృతజ్ఞతగా అతనికి తనవద్ద ఉన్న ఆయుర్వేద విద్యను ఇచ్చాడు. తన కుమార్తెను కూడా ఇచ్చి వివాహం చేసాడు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి