మహాభారత యుద్ధం అయిపోయిన తరువాత యుద్ధంలో విజయం సాధించిన పాండవులు అశ్వమేధయాగం చేశారు. ఆ యాగమును అత్యంత వైభవంగా, శాస్త్రోక్తంగా చేశారు. ఆ యాగమును చూడటానికి వచ్చినవారందరికీ వారు అత్యంత గొప్పవయినా దానాలు చేశారు. అలా రత్నములు, మణులు దానాలు తీసుకున్న రాజులు బ్రాహ్మణులూ వానిని మోయలేక మోయలేక వారి వారి ఇళ్లకు తీసుకెళుతూ ఉన్నారు. ఆ సమయంలో అన్నదానం కూడా జరుగుతోంది.
అలా వివిధములయిన దానములు తీసుకున్న బ్రాహ్మణులు ఒక చోట కొందరు గుంపుగా నిలబడి ఆ పాండవుల ధర్మనిరతని మెచ్చుకుంటూ, వారు చేసిన ఆ అశ్వమేధయాగాన్ని కీర్తిస్తూ, ఇంతగొప్ప దానములు చేసాడు అని మాట్లాడుకుంటూ ఉండగా!
అక్కడే చాటుగా సంచరిస్తున్న వింతగా సగం దేహం బంగారు కాంతితో మెరిసిపోతున్న ఒక ముంగీస వచ్చి, ఈ అశ్వమేధయాగం ఎంతమాత్రమూ సక్తుప్రస్తుని త్యాగానికి, ధర్మానికి సరితూగదు అని చెప్పింది. ఆ మాటలు విన్న బ్రాహ్మణులూ ఆశ్చర్యపోయి ఆ సక్తుప్రస్తుని కథను తెలుసుకుని ఆనందించారు. అంతేకాక సక్తుప్రస్తుడు చేసిన దాన విశేషణ ఫలముగా ముంగీసకు సగం దేహం బంగారు వర్ణం కలిగింది. మరి పాండవులు చేసిన అశ్వమేధ యాగ ప్రాంగణంలో ఆ ముంగీస మిగిలిన దేహం బంగారు మాయం కాలేదు కనుక ఆ బ్రాహ్మణులుకూడా ఆ ముంగీస మాటలతో ఏకిభవించారు.
దానికి కారణం కూడా మనకు మహాభారతం లో చెప్పారు. అశ్వమేధయాగం అనేది అశ్వమును వినియోగించి చేస్తారు. అంటే జంతువును హింసిస్తారు. కానీ సక్తుప్రస్తుడు, అతని కుటుంబం చేసిన దానము అహింస అనే పునాది మీద జరిగినది. కనుక ఎల్లప్పుడూ హింసకంటే అహింస ఎంతో గొప్పది.
అలా అక్కడ ఉన్న బ్రాహ్మణులు ముంగీస చెప్పిన మాటలు అంగీకరించారో అప్పుడు ఆ ముంగీసకు ఉన్న శాపవిమోచనం కలిగి ఆనందిస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది.

కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి